News February 10, 2025
సిద్దిపేట జిల్లాలో పోలీస్ యాక్ట్ అమలు: CP

సిద్దిపేట జిల్లా పోలీస్ కమిషనరేట్ పరిధిలో సిద్దిపేట సిటీ యాక్ట్ అమలులో ఉంటుందని సీపీ అనురాధ తెలిపారు. ఫిబ్రవరి 12 నుంచి 27 వరకు పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందన్నారు. కమిషనరేట్ పరిధిలో ధర్నాలు, ర్యాలీలు, రాస్తారోకోలు, సభలు, సమావేశాలు నిర్వహించకూడదన్నారు. ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించాలన్నా ముందస్తు అనుమతులు తప్పనిసరి అన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
Similar News
News November 7, 2025
ఫ్లైట్స్ డిలే.. క్రమంగా తొలగుతున్న సమస్య!

ఢిల్లీ ఎయిర్‌పోర్టులో తలెత్తిన టెక్నికల్ <<18227103>>సమస్య<<>> క్రమంగా తొలగుతున్నట్లు అధికారులు తెలిపారు. త్వరలోనే పూర్తిస్థాయి విమానాలు ఎలాంటి ఆటంకం లేకుండా రాకపోకలు సాగించే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా టెక్నికల్ గ్లిచ్‌తో ఏటీఎస్ వ్యవస్థ పూర్తిగా కుప్పకూలింది. దీంతో ఢిల్లీ ఎయిర్‌పోర్టు నుంచి రాకపోకలు సాగించాల్సిన 500కు పైగా విమానాల్లో తీవ్ర అంతరాయం ఏర్పడింది. ముంబైలోనూ ఈ సమస్య ఎదురైంది.
News November 7, 2025
విద్యాసంస్థలకు రేపు సెలవు లేదు: డీఈవో

మొంథా తుఫాన్ ప్రభావం వల్ల కర్నూలు జిల్లా వ్యాప్తంగా గత నెల 29న అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సెలవు ప్రకటించిన విషయం తెలిసిందే. అకడమిక్ క్యాలెండర్ ప్రకారం రేపు రెండో శనివారం సెలవు ఉన్నప్పటికీ విద్యా సంవత్సరంలో పనిదినాలు అమలుపరచడంలో భాగంగా రేపు అన్ని స్కూళ్లు ఉంటాయని డీఈవో శామ్యూల్ పాల్ ఓ ప్రకటనలో తెలిపారు. ఎంఈఓలు, హెచ్ఎంలు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు.
News November 7, 2025
రేపు టీడీపీ కేంద్ర కార్యాలయంలో CBN

సీఎం చంద్రబాబు శనివారం ఉదయం 11 గంటలకు మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయానికి రానున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆయన పార్టీ కార్యాలయంలోనే ఉండనున్నారు. కాగా గత వారం పార్టీ కేంద్ర కార్యాలయానికి చంద్రబాబు వచ్చిన సమయంలో ఇక ప్రతివారం ఒక రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు పార్టీ కార్యాలయంలోనే ఉంటానని స్పష్టం చేశారు. ఈ నేపధ్యంలో ప్రజల నుంచి వినతులు స్వీకరించే అవకాశం ఉన్నట్లు సమాచారం.


