News February 10, 2025
సిద్దిపేట: ‘నేషనల్ హైవే రోడ్ పనులు వేగంగా పూర్తి చేయాలి’

నేషనల్ హైవే రోడ్ పనులను వేగంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఎం. మను చౌదరి నేషనల్ హైవే అధికారులు, కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. సోమవారం సమీకృత జిల్లా కలెక్టరేట్ సముదాయంలోని కాన్ఫరెన్స్ హాల్‌లో నేషనల్ హైవే ఇంజనీర్, కాంట్రాక్టర్, రెవెన్యూ, మున్సిపల్ అధికారులతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు.
Similar News
News January 13, 2026
వికారాబాద్ ఫైనల్ లిస్ట్ వచ్చేసింది..!

వికారాబాద్ జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల తుది జాబితాను అధికారులు విడుదల చేశారు. జిల్లాలో 4 మున్సిపాలిటీలు ఉన్నాయి. అందులో తాండూర్ మున్సిపాలిటీలో 36 వార్డుల్లో 77,110 ఓటర్లు, వికారాబాద్‌లో 34 వార్డులకు 58,117, పరిగిలో 18 వార్డుల్లో 27,616, కొడంగల్‌లో 12 వార్డులకు 11,318 మంది ఓటర్లు ఉన్నారు. తుది జాబితాను ఆయా మున్సిపాలిటీల్లోని నోటీస్ బోర్డులో ప్రదర్శించారు. ఫైనల్ లిస్ట్‌లో మీపేరు ఉందా చెక్ చేయండి.
News January 13, 2026
నాగర్‌కర్నూల్ జిల్లాలో తగ్గిన చలి తీవ్రత..!

నాగర్‌కర్నూల్ జిల్లాలో గత నాలుగు రోజులుగా చలి తీవ్రత గణనీయంగా తగ్గుముఖం పట్టింది. గడిచిన 24 గంటల్లో అమ్రాబాద్‌లో అత్యల్పంగా 16.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. బల్మూరులో 16.6, నాగర్‌కర్నూల్‌లో 16.8, లింగాల, తెలకపల్లిలో 17.1 డిగ్రీల చొప్పున కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే పెరగడంతో ప్రజలకు చలి నుంచి ఉపశమనం లభించింది.
News January 13, 2026
రేపటి నుంచి ఉమామహేశ్వర బ్రహ్మోత్సవాలు

అచ్చంపేట మండలంలోని రంగాపూర్ ఉమామహేశ్వర స్వామి క్షేత్రంలో బుధవారం నుంచి వారం రోజుల పాటు బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించనున్నారు. 15న ప్రభోత్సవం, 16న కళ్యాణోత్సవం, 17న అశ్వ వాహన సేవ, 18న నంది వాహన సేవ నిర్వహించనున్నట్లు ఆలయ ఛైర్మన్ మాధవరెడ్డి తెలిపారు. ఉత్సవాలకు వచ్చే భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పేర్కొన్నారు.


