News February 10, 2025
రాంపూర్: రేపు అంతరాష్ట్ర ఎద్దుల బల ప్రదర్శన

నర్వ మండల పరిధిలోని రాంపూర్ గ్రామంలో శ్రీ సద్గురు శరణ శంకర సిద్ధ లింగ మహారాజ్ జాతర మహోత్సవ సందర్భంగా అంతరాష్ట్ర ఎద్దుల బల ప్రదర్శన నిర్వహిస్తామని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. వారు మాట్లాడుతూ.. నాలుగో పళ్ళ విభాగం మంగళవారం, ఆరోపళ్ళ విభాగం బుధవారం నిర్వహిస్తామన్నారు. గెలుపొందిన ఎద్దుల బల ప్రదర్శనకు బహుమతులు ఉంటాయని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. అందరూ పాల్గొనాల్సిందిగా కోరారు.
Similar News
News April 2, 2026
కవిత సమక్షంలో ‘జాగృతి’లోకి భారీ చేరికలు

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సమక్షంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన పలువురు యువకులు, మహిళలు గురువారం పార్టీలో చేరారు. జిల్లా అధ్యక్షుడు హరిప్రసాద్ ఆధ్వర్యంలో వినీత్ కుమార్, తాజ్, రణధీర్, నవ్య, మాధవి తదితరులకు కవిత కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రాజకీయ శక్తిగా ఎదుగుతున్న జాగృతి ఆవిర్భావ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
News April 2, 2026
పాడేరు: స్పెషల్ ఆఫీసర్స్‌కే చెక్ పవర్

అల్లూరి, పోలవరం జిల్లాల్లో సర్పంచ్‌ల చెక్ పవర్ నేటితో రద్దు అయ్యిందని జిల్లా పంచాయతీ అధికారి చంద్రశేఖర్ రావు గురువారం సాయంత్రం తెలిపారు. రేపటి నుంచి స్పెషల్ ఆఫీసర్స్ పాలన ప్రారంభం అవుతుందన్నారు. ఇకపై వారికే చెక్ పవర్ ఉంటుందన్నారు. అల్లూరి జిల్లాలో 244, పోలవరం జిల్లాలో 186 పంచాయతీలకు గెజిటెడ్ అధికారులను ప్రత్యేక అధికారులుగా కలెక్టర్ నియమించారని చెప్పారు.
News April 2, 2026
TU: బోటనీ విభాగంలో సుబ్రహ్మణ్యంకు డాక్టర్ ప్రధానం

టీయూ బోటనీ విభాగానికి చెందిన పరిశోధక విద్యార్థి సుబ్రహ్మణ్యం ‘స్టడీస్ ఆన్ గ్రోత్ అండ్ మెటబాలిజం ఆఫ్ ఒరోక్సిలమ్ ఇండికమ్ సప్లిమెంటెడ్ విత్ సెలెక్టెడ్ ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్స్’ అనే అంశంపై అధ్యాపకుడు అబ్దుల్ అహ్మద్ అలీమ్ ఖాన్ పర్యవేక్షణలో పరిశోధన పూర్తి చేశారు. గురువారం ఓయూ బోటనీ విభాగాధిపతి సబితా రాణి ఎక్స్టర్నల్‌గా వ్యవహరించి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం గురువారం డాక్టరేట్ ప్రదానం చేశారు.


