News February 10, 2025
75,281 ధాన్యం సంచులు మాయం: నిర్మల్ ఎస్పీ

లక్ష్మణచాంద మండలంలోని ఓ రైస్ మిల్లులో జిల్లా పోలీస్ యంత్రాంగం తనిఖీలు నిర్వహించింది. 75,281 సంచుల వరి ధాన్యం కొరత తేలినట్లు జిల్లా ఎస్పీ జానకి షర్మిల సోమవారం ప్రకటనలో తెలిపారు. భైంసాలో <<15417875>>పీడీఎస్ బియ్యాన్ని<<>> సీజ్ చేసి సదరు రైస్ మిల్‌పై తనిఖీ నిర్వహించగా ధాన్యం సంచుల లోటు వచ్చిందని పేర్కొన్నారు.
Similar News
News January 6, 2026
మేడారం విధుల్లో నిబంధనలు తప్పనిసరి: ఈడీ

మేడారం జాతర స్పెషల్ బస్సుల్లో విధులు నిర్వహించే డ్రైవర్లు, కండక్టర్లు క్రమశిక్షణతో వ్యవహరించాలని కరీంనగర్ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఈడీ) సోలొమాన్ స్పష్టం చేశారు. సోమవారం ములుగు రోడ్డులోని జోనల్ స్టాఫ్ ట్రైనింగ్ కాలేజీలో నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. మద్యం తాగి, నిర్లక్ష్యపు డ్రైవింగ్‌పై నిఘా ఉంటుందని హెచ్చరించారు. ప్రమాదం సంభవిస్తే వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించాలని సూచించారు.
News January 6, 2026
ఈనెల 10 నుంచి సంక్రాంతి సెలవులు: DEO

సంగారెడ్డి జిల్లాలోని అన్ని రకాల పాఠశాలలకు ఈ నెల 10 నుంచి 16 వరకు సంక్రాంతి సెలవులు ప్రకటించినట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ మేరకు విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. సెలవుల అనంతరం తిరిగి 17న పాఠశాలలు పునఃప్రారంభం అవుతాయని పేర్కొన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు ఈ ఉత్తర్వులను కచ్చితంగా పాటించాలని డీఈఓ స్పష్టం చేశారు.
News January 6, 2026
సంక్రాంతి సెలవులు ఖరారు చేసిన ప్రభుత్వం

TG: రాష్ట్రంలో సంక్రాంతి సెలవులను ప్రభుత్వం ఖరారు చేసింది. ఈ నెల 10 నుంచి 16 వరకు హాలిడేస్ ఉంటాయని ప్రకటించింది. తిరిగి శనివారం (17న) స్కూళ్లు తెరుచుకోనున్నాయి. ఈ మేరకు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలోని అన్ని స్కూళ్లు ఈ సెలవుల షెడ్యూల్‌ను పాటించాలని ఆదేశించారు. అటు ఏపీలో ఈ నెల 10 నుంచి 18 వరకు సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే.


