News February 10, 2025

విజయవాడ: ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేసిన కలెక్టర్   

image

నులి పురుగులు పిల్లలలో రక్తహీనత, పోషక లోపాలకు కారణమవుతాయని, అందుకే అందరూ ఆల్బెండజోల్ మాత్రలు తీసుకోవాలని కలెక్టర్ లక్ష్మీశ అన్నారు. ఈ మేరకు ఆయన సోమవారం  విజయవాడ గవర్నర్‌పేటలోని చుండూరు వెంకటరెడ్డి నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాలలో జరిగిన జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్ చిన్నారులకు స్వయంగా ఆల్బెండజోల్ మాత్రలు పంపిణి చేశారు.   

Similar News

News March 18, 2026

పల్నాడు: మంత్రి లోకేశ్‌ను కలిసిన కొమ్మాలపాటి

image

మంత్రి నారా లోకేశ్‌ను ఉండవల్లిలోని నివాసంలో పల్నాడు జిల్లా టీడీపీ మాజీ అధ్యక్షుడు కొమ్మాలపాటి శ్రీధర్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ మేరకు పలు అంశాలపై ఆయన మంత్రితో చర్చించారు. కాగా కొమ్మాలపాటి వరుసగా పెదకూరపాడు నియోజకవర్గం టికెట్ ఆశించినా రాకపోవడంతో పాటు, పల్నాడు జిల్లా అధ్యక్షుడు పదవి కూడా పోవడంతో ఆయన సన్నిహితులు నిరాశలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన మంత్రి లోకేశ్‌ను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది.

News March 18, 2026

ఆ కళ్లద్దాలతో న్యూడ్, బెడ్‌రూమ్ దృశ్యాలు రికార్డ్!

image

మెటా AI స్మార్ట్ గ్లాసెస్ వినియోగదారుల అత్యంత వ్యక్తిగత దృశ్యాలను రికార్డ్ చేసి కెన్యాలోని రివ్యూయర్లకు పంపిస్తున్నట్లు స్వీడిష్ పత్రికల ఇన్వెస్టిగేషన్‌లో తేలింది. దాని ప్రకారం.. న్యూడ్, బెడ్‌రూమ్, బాత్‌రూమ్ దృశ్యాలతో పాటు బ్యాంక్ కార్డుల వివరాలు అక్కడి సిబ్బందికి చేరుస్తున్నాయి. బ్లర్ చేసే టెక్నాలజీ పనిచేయక వ్యక్తుల ముఖాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీంతో మెటాపై క్లాస్ యాక్షన్ దావా నమోదైంది.

News March 18, 2026

తిరుపతి: 333 మంది గైర్హాజరు

image

రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం కెమిస్ట్రీ పేపర్-2 పరీక్ష జరిగింది. ఇందులో భాగంగా తిరుపతి జిల్లా వ్యాప్తంగా 84 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తం 24,332 మంది విద్యార్థులకు గాను 23,999 మంది విద్యార్థులు హాజరైనట్లు రాజశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా 333 మంది విద్యార్థులు గైర్హాజరు అయినట్లు తెలియజేశారు.