News February 10, 2025
రోహిత్ ఇలానే ఆడితే భారత్‌దే ఛాంపియన్స్ ట్రోఫీ: అజారుద్దీన్

టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఫామ్‌లోకి రావడం సంతోషంగా ఉందని మాజీ క్రికెటర్ అజారుద్దీన్ అన్నారు. ఆయన ఇలానే తన జోరు కొనసాగిస్తే భారత్‌దే ఛాంపియన్స్ ట్రోఫీ అని అభిప్రాయపడ్డారు. సరైన సమయంలో హిట్‌మ్యాన్ ఫామ్ అందుకున్నారని ప్రశంసించారు. ఆ మెగా టోర్నీలో రోహిత్ అద్భుతంగా రాణించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. కాగా ఇంగ్లండ్‌తో జరిగిన రెండో వన్డేలో రోహిత్ సెంచరీ బాదిన విషయం తెలిసిందే.
Similar News
News March 28, 2026
రైతులకు ఐడీ కార్డులు.. ₹215 కోట్లతో ప్రోత్సాహకాలు

TG: రాష్ట్రంలో కూరగాయల సాగును పెంచేందుకు ప్రభుత్వం రైతులకు ప్రత్యేక ‘కిసాన్ ఐడీ కార్డులు’ జారీ చేయనుంది. వీటి ద్వారా లోన్లు, మార్కెటింగ్ సదుపాయాలు ఈజీగా అందుతాయి. ₹215 కోట్ల బడ్జెట్‌తో పందిళ్లు, యంత్ర పరికరాలపై 50% సబ్సిడీని ప్రకటించింది. రాబోయే ఐదేళ్లలో సాగు విస్తీర్ణాన్ని 2.50 లక్షల ఎకరాలకు పెంచడమే లక్ష్యంగా పెట్టుకుంది. కోతుల నుంచి రక్షణ కోసం సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటుకూ సహకారం అందించనుంది.
News March 28, 2026
వామ్మో.. సగం విమానాల్లో లోపాలు

గతేడాది కాలంలో తనిఖీ చేసిన 754 విమానాల్లో ఏకంగా 377 విమానాల్లో టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నట్లు పార్లమెంటరీ కమిటీ గుర్తించింది. ముఖ్యంగా ఎయిరిండియా, ఇండిగో విమానాల్లో ఈ సమస్యలు ఎక్కువగా ఉన్నాయని నివేదిక వెల్లడించింది. 2025 జూన్‌లో జరిగిన అహ్మదాబాద్ విమాన ప్రమాదం తర్వాత చేపట్టిన ఆడిట్‌లో ఈ నిజాలు బయటపడ్డాయి. ప్రయాణికుల భద్రతను దృష్టిలో పూర్తిగా ప్రక్షాళన చేయాలని కమిటీ కేంద్రానికి సిఫార్సు చేసింది.
News March 28, 2026
చిరంజీవి గొప్ప మనసు.. అవార్డు డబ్బు విరాళంగా

చిరంజీవి మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నారు. ఇటీవల ప్రభుత్వం అందించిన ‘NTR జాతీయ పురస్కారం’తో పాటు వచ్చిన ₹10 లక్షలను ఆయన స్వచ్ఛంద సంస్థలకు విరాళంగా ఇచ్చారు. సర్వ్, దేవనార్ ఫౌండేషన్ ఫర్ ది బ్లైండ్, వాల్మీకి, నయశ్రీ ఫౌండేషన్లతో పాటు క్యాన్సర్‌తో పోరాడుతున్న ఓ చిన్నారి చికిత్స కోసం బసవతారకం ఆసుపత్రికి ఈ సాయం అందించారు. శుక్రవారం రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సేవా కార్యక్రమాలు చేపట్టడం విశేషం.


