News February 10, 2025

రామగుండం: సైబర్ నేరాల కట్టడిపై ప్రత్యేక దృష్టి: సీపీ

image

సైబర్ నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించినట్లు రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ పేర్కొన్నారు. పోలీస్ కమిషనరేట్ ఆవరణలో జరిగిన సమావేశంలో CP మాట్లాడుతూ.. ప్రతి PSలో సైబర్ వారియర్ సిబ్బంది తీసుకోవాల్సిన చర్యల గురించి అవగాహన కల్పించారు. ఆన్‌లైన్, ఆర్థిక మోసాలపై దర్యాప్తు చేయడం, సైబర్ నేరాల కట్టడిపై ప్రత్యేక శిక్షణ, అవగాహన కల్పించారు. పోలీసు అధికారులు రాజు, రాఘవేంద్రరావు పాల్గొన్నారు.

Similar News

News March 26, 2026

నేడే KNR బార్ అసోసియేషన్ ఎన్నికలు.. వారి ఓట్లే కీలకం

image

కరీంనగర్ జిల్లా కోర్టులో న్యాయవాదుల బార్ అసోసియేషన్ ఎన్నికలు నేడు జరగనున్నాయి. మొత్తం 1,080 మంది ఓటర్లు ఉండగా, పోలింగ్ ముగిసిన వెంటనే ఓట్లు లెక్కించి ఫలితాలు ప్రకటిస్తారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3:30 గంటల వరకు కోర్టు ఆవరణలో పోలింగ్ నిర్వహించనున్నట్లు ఎన్నికల అధికారి రామకృష్ణచారి తెలిపారు. ముఖ్యంగా జూనియర్ న్యాయవాదుల ఓట్లు గెలుపోటములను శాసించనున్నాయి.

News March 26, 2026

ముంబై ఇండియన్స్.. ప్లేయింగ్-11 ఇదేనా?

image

IPL-2026లో ముంబై స్ట్రాంగ్‌గా కనిపిస్తోంది. రోహిత్, సూర్య, పాండ్య లాంటి స్టార్లు ఆ జట్టు సొంతం. బుమ్రా, బౌల్ట్‌లతో పేస్ దళం కూడా బలంగానే ఉంది. అయితే స్పిన్ విభాగం కాస్త బలహీనంగా కనిపిస్తోంది.
ప్లేయింగ్ 11 అంచనా: రోహిత్ శర్మ, డికాక్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్య (C), నమన్ ధీర్, రూథర్‌ఫర్డ్, శాంట్నర్, శార్దుల్/దీపక్ చాహర్, బుమ్రా, అశ్వని/మయాంక్ మార్కండే, బౌల్ట్.

News March 26, 2026

యువతకు అలర్ట్.. TGPSC OTR గడువు పొడిగింపు

image

KNR జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగాలకు సన్నద్ధమవుతున్న నిరుద్యోగులకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అత్యంత కీలకమైన అప్‌డేట్ ఇచ్చింది. రాబోయే ఉద్యోగ నోటిఫికేషన్లకు దరఖాస్తు చేసుకోవాలంటే అభ్యర్థులందరూ తప్పనిసరిగా వన్ టైమ్ రిజిస్ట్రేషన్ పూర్తిగా లేదా అప్‌డేట్ చేసుకోవాలని స్పష్టం చేసింది. ఇటీవల ప్రభుత్వం తెచ్చిన SC వర్గీకరణ నేపథ్యంలో విద్యా అర్హతల్లో తప్పులు సరిదిద్దుకోవడానికి APR 10 వరకు అవకాశం కల్పించారు.