News February 10, 2025
రాజమండ్రి: బ్రిడ్జిపై రెండు కార్లు ఢీ.. ట్రాఫిక్ జామ్

రాజమండ్రి రోడ్ కం రైల్వే బ్రిడ్జిపై రెండు కార్లు ఢీ కొట్టడంతో ట్రాఫిక్ స్తంభించింది. ఈ ఘటనలో సుమారు రెండు గంటలు పాటు బ్రిడ్జిపై రాకపోకలు నిలిచిపోయాయి. వాహనాలు బ్రిడ్జిపై నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. ఈ ప్రమాదంలో ఎవరికి గాయాలు కాలేదని ప్రయాణీకులంతా సురక్షితంగా ఉన్నారని పోలీసులు తెలిపారు. సిబ్బంది సకాలంలో చేరుకుని ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు.
Similar News
News March 22, 2026
10,897 సిలిండర్లు సిద్ధం.. ఆందోళన వద్దు: JC

గృహ వినియోగ గ్యాస్ సిలిండర్లను వాణిజ్య అవసరాలకు ఉపయోగిస్తే కఠిన చర్యలు తప్పవని జాయింట్ కలెక్టర్ వై. మేఘా స్వరూప్ హెచ్చరించారు. ఇప్పటివరకు 42 కేసులు నమోదు చేసి, 114 సిలిండర్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. జిల్లాలో ఎల్పీజీ కొరత లేదని, పంపిణీదారుల వద్ద 10,897 సిలిండర్లు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. సరఫరా సజావుగా సాగుతున్నందున ప్రజలు ఆందోళన చెందవద్దని ఆయన సూచించారు.
News March 22, 2026
ఆన్‌లైన్‌లోనూ అర్జీల నమోదు: తూ.గో కలెక్టర్

తూ.గో జిల్లా రాజమండ్రిలోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఈ నెల 23న PGRS & రెవెన్యూ క్లినిక్ యథావిధిగా నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి శనివారం తెలిపారు. అర్జీదారులు తమ అర్జీలను Meekosam.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చని తెలిపారు. అలాగే అర్జీల నమోదు, నమోదైన అర్జీల స్థితి తదితర వివరాల కోసం 1100కు నేరుగా కాల్ చేయవచ్చని కలెక్టర్ సూచించారు.