News February 10, 2025

నిర్మలా సీతారామన్‌తో విశాఖ ఎంపీ భేటీ

image

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ను విశాఖ ఎంపీ శ్రీభరత్ సోమవారం ఢిల్లీలో కలిశారు. ఈ సందర్భంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ పునరుద్ధరణ ప్యాకేజీకి సహకరించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. యూనియన్ బడ్జెట్‌లో 12 లక్షల వరకు వచ్చే జీతాలకు ఆదాయపు పన్ను ఉపశమనం కల్పించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఆదాయపు పన్ను కుదించడంతో మధ్యతరగతి ప్రజలకు ఉపశమనం కలుగుతుందన్నారు. 

Similar News

News February 11, 2025

UPDATE: రీల్స్ పేరుతో పెళ్లి.. యువకుడిపై పోక్సో

image

ఓ బాలిక ఇన్‌స్టా‌గ్రామ్‌లో చేసిన రీల్‌కు లైక్ కొట్టి ట్రాప్ చేసిన యువకుడిని విశాఖ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. తాటిచెట్లపాలెంకి చెందిన భార్గవ్ ఓ బాలిక రీల్‌కు లైక్ కొట్టి ఫోన్ నంబర్ తీసుకున్నాడు. ఈ క్రమంలో ఆమెకు దగ్గరై పెళ్లి చేసుకోగా విషయం బాలిక తల్లిదండ్రులకు తెలిసింది. వారి ఫిర్యాదు మేరకు భార్గవ్‌పై పోక్సో కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపర్చగా న్యాయమూర్తి సోమవారం రిమాండ్ విధించారు.

News February 11, 2025

విశాఖ: రోడ్డుప్రమాదంలో యువతి మృతి

image

విశాఖలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో యువతి మృతిచెందింది. శ్రీకాకుళం(D) ఇచ్ఛాపురానికి చెందిన ఉషారాణి(22) స్నేహితుడు సిద్దూతో కలిసి ఓ ఫార్మా కంపెనీలో ఇంటెర్న్‌ చేస్తోంది. ఉషారాణికి కొరియర్ రాగా సిద్దూతో కలిసి బైక్‌పై ఆటోనగర్‌ వెళ్లింది. తిరిగి వస్తుండగా వెనుక నుంచి లారీ ఢీట్టడంతో ఉషారాణి కింద పడింది. ఆమె పైనుంచి లారీ వెళ్లడంతో అక్కడికక్కడే మృతిచెందినట్లు గాజువాక ట్రాఫిక్ CI కోటేశ్వరరావు తెలిపారు.

News February 11, 2025

విశాఖ: ఆన్‌లైన్ లోన్‌యాప్స్ ముఠా అరెస్ట్  

image

ఆన్ లైన్ లోన్ యాప్స్‌తో మోసాలకు పాల్పడుతున్న ముఠాను విశాఖ సీపీ శంఖబ్రత బాగ్చి ఆదేశాల మేరకు సోమవారం అరెస్ట్ చేశారు. విశాఖలో ఓ సూసైడ్ కేసు విచారణలో భాగంగా లోన్ యాప్‌లో అప్పు తీసుకుని సమయానికి కట్టకపోవడంతో ఫొటోలు మార్ఫింగ్ చేసి వారు వేధించడం వల్ల చనిపోయినట్లు గుర్తించారు. ఈ విషయంపై విశాఖ పోలీసులు నిందితుడుని కర్నూలులో అరెస్ట్ చేశారు. ఈ కేసులో కోట్ల రూపాయలు లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు.

error: Content is protected !!