News February 10, 2025
పాలకుర్తి: శ్రీ సోమేశ్వర జాతర వాల్ పోస్టర్లను ఆవిష్కరించిన కలెక్టర్

మహాశివరాత్రి సందర్భంగా ఈనెల 25 నుంచి మార్చి1 వరకు పాలకుర్తిలోని శ్రీ సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి జాతర నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అదనపు కలెక్టర్ రోహిత్ సింగ్‌తో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం జాతరకు సంబంధించి వాల్‌పోస్టర్లను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డీసీపీ రాజమహేంద్ర నాయక్, ఆలయ అధికారులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Similar News
News January 17, 2026
రిపబ్లిక్ డే వేడుకలకు ఉగ్ర ముప్పు!

రిపబ్లిక్ డే వేడుకలను ఉగ్ర సంస్థలు టార్గెట్ చేసినట్లు నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఢిల్లీతోపాటు దేశంలోని ప్రధాన నగరాల్లో ఖలిస్థానీ, బంగ్లా టెర్రర్ సంస్థలు దాడులకు ప్లాన్ చేసినట్లు వెల్లడించాయి. హరియాణా, పంజాబ్, ఢిల్లీ-NCR, UP, రాజస్థాన్‌లో ఖలిస్థానీ ఉగ్రవాదులతో లింక్ ఉన్న గ్యాంగ్‌స్టర్లు యాక్టివ్‌గా ఉన్నట్లు తెలిపాయి. గతేడాది ఢిల్లీలో <<18265346>>కారు పేలుడు<<>> నేపథ్యంలో కేంద్ర నిఘా సంస్థలు హైఅలర్ట్ ప్రకటించాయి.
News January 17, 2026
వికారాబాద్: ఖరారైన మున్సిపల్ ఛైర్మన్ రిజర్వేషన్లు

వికారాబాద్ జిల్లాలో మున్సిపల్ ఛైర్మన్ పదవుల రిజర్వేషన్లు వచ్చాయి. వికారాబాద్ మున్సిపాలిటీలో ఎస్సీ మహిళ, తాండూరు మున్సిపాలిటీ బీసీ జనరల్, పరిగి మున్సిపాలిటీలో బీసీ మహిళ, కొడంగల్ – అన్ రిజర్వుడ్‌గా వచ్చింది. మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు కావడంతో ఆశావాహులు ఛైర్మన్ పదవిపై కన్నేశారు. కొడంగల్లో అన్ రిజర్వుడ్ కావడంతో పోటీ పెరగనుంది.
News January 17, 2026
సిద్దిపేట జిల్లా మున్సిపల్ రిజర్వేషన్లు ఖరారు

సిద్దిపేట జిల్లాలోని ఐదు మున్సిపాలిటీలకు ఛైర్మన్ రిజర్వేషన్లు ఖరారయ్యాయి. సిద్దిపేటను బీసీ జనరల్‌కు, చేర్యాలను ఎస్సీ మహిళకు, హుస్నాబాద్‌ను ఎస్సీ జనరల్‌కు కేటాయించారు. గజ్వేల్, దుబ్బాక స్థానాలు బీసీ మహిళలకు దక్కాయి. రిజర్వేషన్లు తేలడంతో ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొనగా, ఎన్నికల రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది.


