News February 10, 2025

రంగరాజన్‌పై దాడి.. స్పందించిన DCP

image

TG:చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్‌పై ఇటీవల జరిగిన దాడి <<15408903>>ఘటనపై <<>>రాజేంద్రనగర్ DCP శ్రీనివాస్ స్పందించారు. ‘ఇవాళ ఇద్దరు మహిళలు సహా ఐదుగురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపాం. నిందితులు ఖమ్మం, నిజామాబాద్‌కు చెందిన వారు. 2022లో వీరరాఘవరెడ్డి ‘రామరాజ్యం’ అనే సంస్థను ప్రారంభించారు. సంస్థలో సభ్యులను చేర్పించాలని, ఆర్థిక సాయం చేయాలని రంగరాజన్‌ను కోరారు. ఒప్పుకోకపోవడంతో దాడి చేశారు’ అని చెప్పారు.

Similar News

News April 3, 2026

ఏప్రిల్ 3: చరిత్రలో ఈరోజు

image

★ 1914: భారత్ తొలి ఫీల్డ్ మార్షల్ శామ్ మానెక్ షా జననం
★ 1955: సింగర్ హరిహరన్ జననం
★ 1962: సినీనటి జయప్రద జననం
★ 1973: నృత్యదర్శకుడు, నటుడు ప్రభు దేవా జననం
★ 1680: మరాఠా సామ్రాజ్య వ్యవస్థాపకుడు ఛత్రపతి శివాజీ మహరాజ్ మరణం
★ 1943: ఇండియన్ ఆర్మీ మెడికల్ కార్ప్స్ స్థాపన

News April 3, 2026

రెండు భాగాలుగా బాలయ్య-వివేక్ ఆత్రేయ సినిమా?

image

యంగ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయతో గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ సినిమాపై ఓ ఆసక్తికర అప్డేట్ సినీవర్గాల్లో చక్కర్లు కొడుతోంది. పెద్ద కథ కావడంతో దీనిని రెండు భాగాలుగా తెరకెక్కించాలని మేకర్స్ డిసైడ్ అయ్యారట. దర్శకుడి నరేషన్ నచ్చడంతో బాలయ్య సైతం ఇందుకు ఓకే చెప్పినట్లు సమాచారం. ఈ ఏడాదిలోనే సెట్స్‌పైకి వెళ్లనున్న ఈ మూవీకి ‘కురుక్షేత్రం’ అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు టాక్.

News April 3, 2026

పుట్టిన రోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.