News February 10, 2025
’మహామండలేశ్వర్‘ పదవికి మమత రాజీనామా
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739191392706_1032-normal-WIFI.webp)
తాను కిన్నర్ అఖాడా మహామండలేశ్వర్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు మాజీ నటి మమతా కులకర్ణి ప్రకటించారు. ఇకపై సాధ్విగానే కొనసాగుతానని ఆమె స్పష్టం చేశారు. కాగా 90ల్లో మంచి క్రేజ్ సంపాదించుకున్న మమత ఆ తర్వాత సినిమాల నుంచి తప్పుకున్నారు. ఓ డ్రగ్స్ రాకెట్‌లోనూ ఆమె పేరు వినిపించింది. ఇటీవల మహాకుంభమేళాలో ఆమె కిన్నర్ అఖాడాలో చేరి సన్యాసినిగా మారారు. కానీ దీనిపై కొందరు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
Similar News
News February 11, 2025
అవినీతి నిరోధక చట్టాన్ని సస్పెండ్ చేసిన ట్రంప్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739153337747_782-normal-WIFI.webp)
డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారం చేపట్టాక పాత చట్టాల దుమ్ము దులిపేస్తున్నారు. US వ్యాపారాలకు విఘాతం కలిగిస్తోందని ఫెడరల్ చట్టం ‘FCPA’ను నిలిపేశారు. మరిన్ని మినహాయింపులు, ఉపశమనం కల్పించేలా సవరించాలని కొత్త అటార్నీ జనరల్ పామ్ బొండిని ఆదేశించారు. అమెరికన్ కంపెనీలు, ఎగ్జిక్యూటివ్స్ బిజినెస్ కోసం ఇతర దేశాల అధికారులకు లంచం ఇవ్వడం ఈ చట్ట ప్రకారం నేరం. అదానీపై FCPA ప్రకారమే అభియోగాలు మోపడం గమనార్హం.
News February 11, 2025
అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక రన్స్ (భారత ప్లేయర్లు)
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739251878304_367-normal-WIFI.webp)
*సచిన్- 34357 రన్స్ (782 ఇన్నింగ్సులు)
*విరాట్- 27329 (611)
*రాహుల్ ద్రవిడ్- 24208 (605)
*రోహిత్ శర్మ- 19519 (526)
*గంగూలీ- 18575 (488)
*ధోనీ- 17266 (526)
*సెహ్వాగ్- 17253 (443)
*అజహరుద్దీన్- 15593 (455)
News February 11, 2025
అదానీపై అమెరికా కేసులో మరో ట్విస్ట్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739252505868_1199-normal-WIFI.webp)
అదానీ గ్రూప్‌పై లంచం కేసులో జో బైడెన్ పాలకవర్గంలోని DoJ తీసుకున్న నిర్ణయాలు ప్రశ్నార్థకంగా ఉన్నాయని ఆరుగురు US కాంగ్రెస్ సభ్యులు కొత్త అటార్నీ జనరల్‌కు లేఖరాశారు. ఇవి మిత్రదేశం భారత్‌తో సంబంధాలను సందిగ్ధంలో పడేశాయన్నారు. రాజకీయాలు, వాణిజ్యం, ఎకానమీస్‌కు అతీతంగా ఎదిగిన 2 దేశాల అనుబంధాన్ని బైడెన్ నిర్ణయాలు రిస్క్‌లో పడేశాయని వెల్లడించారు. కేసును పక్కనపెట్టాల్సింది పోయి ముందుకెళ్లారని ఆరోపించారు.