News February 10, 2025

కల్తీ నెయ్యి కేసు రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు

image

AP: తిరుమల కల్తీ నెయ్యి సరఫరా కేసుకు సంబంధించిన రిమాండ్ రిపోర్టులో సిట్ కీలక అంశాలు వెల్లడించింది. నిందితులు ఆధారాలు చెరిపేసేందుకు పాత ఫోన్లు ధ్వంసం చేసి కొత్తవి కొన్నారని తెలిపింది. నెయ్యి ఉత్పత్తి సామర్థ్యం లేకున్నా ఏఆర్, వైష్ణవి డెయిరీలు టెండర్లలో పాల్గొన్నాయని పేర్కొంది. బోలేబాబా డెయిరీ నెయ్యిని తమ పేరు మీద టీటీడీకి సరఫరా చేసినట్లు వివరించింది. నిందితులు విచారణకు సహకరించడంలేదని తెలిపింది.

Similar News

News February 11, 2025

DANGER: ఈ ఫుడ్ కలర్ వాడితే క్యాన్సర్ రావొచ్చు!

image

అమెరికాలో బ్యాన్ చేసిన ‘RED DYE #3’ ఫుడ్ కలర్‌ను చీప్‌గా వస్తోందని ఇండియాలోని చాలా కంపెనీలు వాడుతున్నాయి. ఈ రంగును చాక్లెట్స్, డ్రింక్స్, కేకుల్లో వాడుతుంటారు. ఇది హానికరమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ‘RED DYE #3’ ఎలుకపై టెస్ట్ చేయగా అది క్యాన్సర్‌కు దారితీసింది. పిల్లల్లో హైపర్ యాక్టివిటీ, ఎలర్జీ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. ప్రొడక్ట్ లేబుల్ చెక్ చేసి దానిలో ‘RED3’ అని ఉంటే వాటిని కొనకండి.

News February 11, 2025

మద్యం నుంచి TDP పెద్దలకు కమీషన్లు: YCP

image

AP: రాష్ట్రంలో మద్యం ధరలు పెరగడంపై YCP ఆరోపణలు చేసింది. ‘మద్యం వ్యాపారం ప్రభుత్వ పెద్దల వ్యక్తిగత ఆదాయ వనరుగా మారింది. ఈ మేరకు లైసెన్సీలకు మార్జిన్ పెంచుతున్నారు. దీంతో TDP పెద్దలకు కూడా కమీషన్ పెరుగుతోంది. అంతిమంగా మద్యం రేట్లు పెరుగుతున్నాయి. ఇది మందుబాబులకు పెనుభారంగా మారనుంది’ అని ట్వీట్ చేసింది. రూ.99 బ్రాండ్ క్వార్టర్, బీర్లు కాకుండా మిగతా మద్యం సీసాపై రూ.10 పెంచిన విషయం తెలిసిందే.

News February 11, 2025

అవినీతి నిరోధక చట్టాన్ని సస్పెండ్ చేసిన ట్రంప్

image

డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారం చేపట్టాక పాత చట్టాల దుమ్ము దులిపేస్తున్నారు. US వ్యాపారాలకు విఘాతం కలిగిస్తోందని ఫెడరల్ చట్టం ‘FCPA’ను నిలిపేశారు. మరిన్ని మినహాయింపులు, ఉపశమనం కల్పించేలా సవరించాలని కొత్త అటార్నీ జనరల్ పామ్ బొండిని ఆదేశించారు. అమెరికన్ కంపెనీలు, ఎగ్జిక్యూటివ్స్ బిజినెస్ కోసం ఇతర దేశాల అధికారులకు లంచం ఇవ్వడం ఈ చట్ట ప్రకారం నేరం. అదానీపై FCPA ప్రకారమే అభియోగాలు మోపడం గమనార్హం.

error: Content is protected !!