News February 10, 2025
సిరిసిల్ల: శివరాత్రి.. భద్రత ఏర్పాట్లపై కలెక్టర్ సమీక్ష

మహాశివరాత్రి జాతరకు పటిష్ఠంగా భద్రత ఏర్పాట్లు చేయాలని సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. పట్టణంలోని కలెక్టర్ కార్యాలయంలో సోమవారం జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, పోలీస్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జాతరకు వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ శేషాద్రి రెడ్డి, వేములవాడ టెంపుల్ ఈవో వినోద్ రెడ్డి, అధికారులు పాల్గొన్నారు.
Similar News
News March 10, 2026
‘కదిరి’ పేరు ఎలా వచ్చిందంటే?

శ్రీ సత్యసాయి జిల్లాలోని లక్ష్మీనరసింహ స్వామి వెలసిన కదిరికి ఆ పేరు రావడం వెనుక ఆసక్తికరమైన పురాణగాథ ఉంది. సంస్కృతంలో ‘ఖాదర’ అంటే చండ్ర చెట్టు అని అర్థం. ఇక్కడ నరసింహస్వామి వారు చండ్ర చెట్టు తొర్ర నుంచి స్వయంభూగా వెలిసినందున ఈ ప్రాంతానికి ‘ఖాద్రీ’ అనే పేరు వచ్చింది. కాలక్రమేణా అది ‘కదిరి’గా రూపాంతరం చెందింది. భక్త ప్రహ్లాదుని కోరిక మేరకు స్వామి వారు ఇక్కడ వెలిశారని ప్రతీతి.
News March 10, 2026
ఉండవల్లి: ప్రమాదంలో వృద్ధురాలు స్పాట్‌డెడ్

తాడేపల్లి పరిధిలోని ఉండవల్లి సాయిబాబా గుడి సమీపంలో మంగళవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన నల్లమట్టి టిప్పర్ ఢీకొనడంతో ఓ వృద్ధురాలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు స్థానికులు తెలిపారు. అనుమతులు లేకుండా, అతివేగంతో మట్టి లారీలు తిరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
News March 10, 2026
విశాఖ, ఉప్పాడలో కోత నివారణ పనులు

విశాఖ, ఉప్పాడ తీర ప్రాంతాల్లో సముద్ర కోత నివారణకు కేంద్ర ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించింది. విశాఖ తీర రక్షణ కోసం రూ.203 కోట్ల ప్రాజెక్టుకు తుది అనుమతులు లభించాయి. అలాగే ఉప్పాడ తీరంలో రక్షణ గోడ నిర్మాణానికి కేంద్రం రూ.323 కోట్లు మంజూరు చేసింది. డిప్యూటీ సీఎం పవన్ ప్రతిపాదించిన ‘గ్రేట్ గ్రీన్ వాల్’ ద్వారా తీరం వెంబడి 5 కి.మీ.ల మేర మొక్కలు నాటి ప్రకృతి సిద్ధమైన రక్షణ కవచాన్ని ఏర్పాటు చేయనున్నారు.


