News February 10, 2025

మెదక్: ఫిజిక్స్ టాలెంట్ టెస్ట్‌లో విద్యార్థుల ప్రతిభ.. ప్రశంసలు

image

జిల్లా స్థాయి ఫిజిక్స్ టాలెంట్ టెస్ట్‌లో మెదక్ విద్యార్థులు తమ ప్రతిభ చూపారు. విజేతలకు డిఈఓ ప్రొ. రాధాకిషన్ బహుమతులు అందజేశారు. మూడు స్థానాలు పొందిన విద్యార్థులు తదుపరి నిర్వహించే రాష్ట్రస్థాయి పోటీలో పాల్గొనాల్సి ఉంటుంది. ప్రథమ బహుమతి సహస్ర రెడ్డి(టీజీఎంఎస్ చేగుంట). ద్వితీయ బహుమతి సిద్ర తస్లీమ్(ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల మెదక్), తృతీయ బహుమతి శ్రీ చరణ్ గౌడ్(జడ్పీహెచ్ఎస్ వెల్దుర్తి) అందుకున్నారు.

Similar News

News February 11, 2025

మెదక్: వేర్వేరుగా నలుగురి ఆత్మహత్య

image

వేర్వేరుగా నలుగురు సోమవారం ఆత్మహత్య చేసుకున్నారు. వివరాలు.. మెదక్ జిల్లా కౌడిపల్లిలో సర్సింలు(38) అప్పులు తీర్చలేక చెరువులో దూకి మృతి చెందగా, చేగుంటలో అనారోగ్యంతో వృద్ధుడు బాలయ్య(79) చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మనోహరబాద్‌లో ఛత్తీస్ గఢ్ కూలీ రాహుల్ (25) చెట్టుకు ఉరేసుకుని, చిలిపిచేడ్‌లో మంజీరాలో దూకి రమేష్(38) ఆత్మహత్య చేసుకున్నాడు. వీరి మృతితో చెందటంతో వారి కుటుంబాలలో విషాదం నెలకొంది.

News February 11, 2025

మెదక్ జిల్లాలో పడిపోతున్న భూగర్భ జలాలు

image

మెదక్ జిల్లా వ్యాప్తంగా ఫిబ్రవరి నెల ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో భూగర్భ జలాలు పడిపోతున్నాయి. దీంతో బోర్లు పొయ్యని పరిస్థితి ఏర్పడుతుంది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. గతేడాది డిసెంబర్లో 9.30మీటర్ల లోతులో నీటిమట్టం ఉంటే జనవరి చివరి వారంకి వచ్చేసరికి 10.94 మీటర్ల లోతుకు నీటిమట్టం పడిపోయిందని అధికారులు తెలిపారు. భూగర్భ జలాలు పడిపోవడంతో నీరును పొదుపుగా వాడుకోవాలని తెలిపారు.

News February 11, 2025

మెదక్: కూలి పనులు దొరకలేదని యువకుడి ఆత్మహత్య

image

మనోహరాబాద్ మండలం ముప్పిరెడ్డిపల్లి శివారులో యువకుడు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. చత్తీస్ గడ్ రాష్ట్రానికి చెందిన రాహుల్ కుమార్(25) పనుల కోసం ఐదు రోజుల క్రితం స్నేహితుడు వద్దకు వచ్చాడు. ఇక్కడ పనులు దొరకకపోవడంతో మద్యానికి బానిసై దగ్గరున్న డబ్బులు అన్ని ఖర్చు చేశాడు. పని లేకపోవడంతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

error: Content is protected !!