News February 10, 2025

ధన్వాడ: బీజేపీకి సీనియర్ నాయకుడు రాజీనామా

image

ధన్వాడ మండలం బీజేపీలో అంతర్గత విభేదాలతో సీనియర్ నాయకుడు ఎర్రగుంట్ల విజయకుమార్ సోమవారం బీజేపీకి రాజీనామ చేశారు. పార్టీలో సీనియర్ అయినప్పటికీ తగిన గుర్తింపు ఇవ్వకపోవడంతో రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. మండల పార్టీ అధ్యక్ష పదవికి పోటీపడిన విజయ్ కుమార్‌ను కాదని శివరాజ్ సాగర్‌కు ఇవ్వడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. ఆయనతో పాటు శ్రీనివాసులు మరికొందరు పార్టీని వీడారు.

Similar News

News November 13, 2025

అల్ ఇండియా అథ్లెటిక్స్ పోటీలకు రంపచోడవరం విద్యార్థి

image

రంపచోడవరం డిగ్రీ కళాశాల విద్యార్థులు నన్నయ యూనివర్శిటీ నిర్వహించిన అథ్లెటిక్స్ పోటీల్లో ప్రతిభ కనబర్చి బంగారు పతకాలు గెలుపొందినట్లు ప్రిన్సిపల్ డాకే వసుధ తెలిపారు. బెంగళూరులో నిర్వహించే అల్ ఇండియా అథ్లెటిక్స్ పోటీలకు జి. ప్రవీణ్ సెలెక్టైనట్లు వివరించారు. పతకాలు సాధించిన విద్యార్థులకు వైస్ ప్రిన్సిపల్ రవికుమార్, పీడీ ప్రభాకర్ రావు, అధ్యాపకులు అభినందించారు.

News November 13, 2025

ఈ రోజు నమాజ్ వేళలు (నవంబర్ 13, గురువారం)

image

✒ ఫజర్: తెల్లవారుజామున 5.05 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.20 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.00 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.05 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 5.41 గంటలకు
✒ ఇష: రాత్రి 6.56 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News November 13, 2025

పాకిస్థాన్‌తో సిరీస్ కొనసాగుతుంది: శ్రీలంక

image

ఇస్లామాబాద్‌లో పేలుడు నేపథ్యంలో పలువురు శ్రీలంక ప్లేయర్లు పాకిస్థాన్ వీడుతారనే ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వన్డే సిరీస్ కొనసాగుతుందని శ్రీలంక క్రికెట్ బోర్డు ప్రకటన జారీ చేసింది. ప్లేయర్లు, సిబ్బందికి తగిన భద్రతను పాక్ కల్పిస్తుందని స్పష్టం చేసింది. ఎవరైనా జట్టును వీడితే వారి స్థానంలో ఇతర ప్లేయర్లను రీప్లేస్ చేస్తామని పేర్కొంది. ఇవాళ పాక్-శ్రీలంక మధ్య రెండో వన్డే జరగనుంది.