News February 10, 2025
KMR: ‘క్రమశిక్షణతో విధులు నిర్వర్తించాలి’
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739195036238_50093551-normal-WIFI.webp)
ప్రతి పోలీసు విధి నిర్వహణలో క్రమశిక్షణతో విధులు నిర్వర్తించాలని పోలీసు సీనియర్ అధికారులు సూచించారు. KMR జిల్లా ఎస్పీ సింధుశర్మ ఆదేశాల మేరకు ఇటీవల నూతనంగా నియామకమైన కానిస్టేబుల్‌లకు జిల్లా పోలీసు కార్యాలయంలో రెండు రోజుల శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. పోలీస్ స్టేషన్లో విధులు ఎలా నిర్వర్తించాలి, ప్రజలతో ఎలా మెలగాలి తదితర విషయాలను కామారెడ్డి సీఐ చంద్రశేఖర్ వివరించారు.
Similar News
News February 11, 2025
వేల్పూరులో బర్డ్ ఫ్లూ నిర్ధారణ: జిల్లా కలెక్టర్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739251447923_51228803-normal-WIFI.webp)
పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా బర్డ్ ఫ్లూ వ్యాపిస్తుండడంతో జిల్లా కలెక్టర్ నాగరాణి మంగళవారం అధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. తణుకు మండలం వేల్పూరులోని కృష్ణానంద పౌల్ట్రీ ఫామ్ లో కోళ్లకు బర్డ్ ఫ్లూ నిర్ధారణ అయినట్లు చెప్పారు. వేల్పూరు నుంచి పది కిలోమీటర్ల వరకు అలర్ట్ జోన్ ప్రకటించారు. చికెన్, కోడిగుడ్లు అమ్మకాలు నిలిపివేయాలని ఆదేశించారు. అన్ని షాపులను మూసివేయాలని సూచించారు.
News February 11, 2025
మధిర: రైలు కిందపడి వ్యక్తి సూసైడ్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739255712478_1072-normal-WIFI.webp)
మంగళవారం తెల్లవారుజామున మధిర రైల్వే స్టేషన్ సమీపంలో ఓ వ్యక్తి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. రైల్వే పోలీసుల ప్రకారం.. ఏపీ ఎన్టీఆర్ జిల్లాకు చెందిన ప్రదీప్ కుమార్ జైపూర్- చెన్నై ఎక్స్ ప్రెస్ కిందపడటంతో అతడి తల తెగిపోయింది. లోకో పైలట్ సమాచారంతో ఖమ్మం జీఆర్పి హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
News February 11, 2025
భువనగిరి: రోడ్డు ప్రమాదంలో టీచర్ మృతి
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739254754686_60353109-normal-WIFI.webp)
అడ్డగూడూరు మండలం చౌళ్లరామారం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో <<15426043>>మృతిచెందిన<<>> మహిళను జబీన్ (40)గా పోలీసులు గుర్తించారు. మోత్కూర్ మండలం దాచారం ప్రభుత్వ పాఠశాలలో ఆమె టీచర్‌గా పనిచేస్తున్నట్లు ఎస్సై నాగరాజు చెప్పారు. అడ్డగూడూరు పాఠశాలలో జరుగుతున్న కార్యక్రమానికి హాజరుకావడానికి వెళుతున్న క్రమంలో రోడ్డు ప్రమాదం జరిగినట్లు తెలిపారు. మృతదేహాన్ని రామన్నపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామన్నారు.