News February 10, 2025

20 లక్షల ఇళ్లకు సౌర విద్యుత్: చంద్రబాబు

image

AP: PM సూర్యఘర్ పథకం కింద ఈ ఏడాది 20 లక్షల కుటుంబాలకు సోలార్ విద్యుత్ అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు CM చంద్రబాబు వెల్లడించారు. 2కిలోవాట్ల వరకు SC, STలకు ఉచితంగా సోలార్ పరికరాలు అందిస్తామని చెప్పారు. ఈ పథకం అమల్లో బ్యాంకులూ భాగస్వామ్యం కావాలని బ్యాంకర్లతో భేటీలో CM కోరారు. ఈ పథకంతో అవసరాలకు ఉచితంగా విద్యుత్ పొందడమే కాకుండా, ఉత్పత్తి అయ్యే విద్యుత్‌తో ప్రజలు ఆదాయం పొందే అవకాశం ఉందన్నారు.

Similar News

News July 9, 2025

ఇక మారుమూల ప్రాంతాల్లోనూ హైస్పీడ్ ఇంటర్నెట్!

image

బిలియనీర్ ఎలాన్ మస్క్‌కు చెందిన స్టార్‌లింక్ శాటిలైట్ కమ్యూనికేషన్స్ భారత్‌లో ఇంటర్నెట్ సేవలు అందించేందుకు మార్గం సుగమమైంది. ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ & ఆథరైజేషన్ సెంటర్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. స్టార్‌లింక్ జెన్1 లో ఎర్త్ ఆర్బిట్(LEO) శాటిలైట్ ద్వారా ఐదేళ్ల పాటు సేవలందించేందుకు అనుమతులిచ్చింది. దీంతో దేశవ్యాప్తంగా మారుమూల ప్రాంతాల్లోనూ హైస్పీడ్ ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి రానున్నాయి.

News July 9, 2025

మార్కెట్‌లో ‘ఫేక్ వెడ్డింగ్’ ట్రెండ్.. అదేంటంటే?

image

మీకు పెళ్లిళ్లకు వెళ్లి ఎంజాయ్ చేయడమంటే ఇష్టమా? అయితే తెలియని వారి పెళ్లిలో కొత్తవారితో సరదాగా గడిపే ఛాన్స్ వచ్చింది. ప్రస్తుతం ఢిల్లీ, నోయిడా నగరాల్లో ‘ఫేక్ వెడ్డింగ్’ ట్రెండ్ నడుస్తోంది. నిర్వాహకులు ఏర్పాటు చేసే ఈ ఫేక్ పెళ్లిలో వధువు, వరుడు ఉండరు. కానీ, అన్ని వేడుకలు, వివాహ భోజనం, బరాత్ ఉంటుంది. ఆన్‌లైన్‌లో రూ.1499 చెల్లించి టికెట్ కొనొచ్చు. ఈ ట్రెండ్ గురించి చర్చ జరుగుతోంది.

News July 9, 2025

తగ్గిన బంగారం ధరలు

image

బంగారం ధరల్లో కొద్దిరోజులుగా హెచ్చుతగ్గులు కన్పిస్తున్నాయి. నిన్న పెరిగిన బంగారం ధరలు ఇవాళ స్వల్పంగా తగ్గాయి. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడిపై ₹660 తగ్గి ₹98,180కు చేరింది. 22 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాముల ధర ₹600 తగ్గి ₹90,000 పలుకుతోంది. అటు కేజీ వెండిపై రూ.100 పెరిగి రూ.1,20,000గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.