News February 10, 2025
ప్రజలకు అవగాహన కల్పించాలి: నెల్లూరు కలెక్టర్

నెల్లూరు జిల్లా కలెక్టర్ ఆనంద్ సోమవారం సాయంత్రం కలెక్టరేట్‌లోని సమావేశ ప్రాంగణంలో మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతినెలా మూడవ శనివారం అన్నిశాఖల అధికారులు స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలపై ప్రత్యేక శ్రద్ధపెట్టాలన్నారు. పీఎం సూర్యఘర్ యోజన పథకంపై ప్రజలకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలన్నారు.
Similar News
News January 5, 2026
వింజమూరు: ఎంపీపీ పదవి టీడీపీ కైవసం

వింజమూరు ఎంపీపీ ఎంపిక గందర గోళానికి దారితీసింది. వైసీపీ తరఫున ఆరుగురు, టీడీపీ నుంచి ఆరుగురు ఎంపీటీసీలు ఉన్నారు. కోరం జరగకుండా చూడాలని ఊటుకూరు ఎంపీటీసీ గవ్వల మల్లిఖార్జునను వైసీసీ నేతలు కిడ్నాప్ చేశారు. అయితే.. కోరంకు 6 మంది సరిపోవడంతో ఎంపీపీని ఒకరు ప్రతిపాదించగా.. ఇద్దరు బలపరచడంతో ఎంపీపీగా టీడీపీకి చెందిన వన్నెపెంట హైమావతిని ఎన్నుకున్నారు.
News January 5, 2026
నెల్లూరు: ఒక్క రోజే 28 మంది వరకు అరెస్ట్.!

నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఆదివారం అసాంఘిక కార్యకలాపాలపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. కోడి పందేలు, పేకాల స్థావరాలపై దాడులు చేసి పలువురిని అదుపులోకి తీసుకున్నారు. సైదాపురం మండల పరిధిలో 10 మందిని పోలీసులు అరెస్ట్ చేయగా, కావలిలో 5 మంది, ఉదయగిరిలో 6 మంది, రాపూరులో 7 మంది పోలీసులకు చిక్కారు. జిల్లాలో అసాంఘిక కార్యకలాపాలపై నిఘా కొనసాగుతుందని పోలీసులు హెచ్చరించారు.
News January 5, 2026
నెల్లూరులో ‘స్పై’ హీరో సందడి

హీరో నిఖిల్ నెల్లూరులో సందడి చేశారు. మాగుంట లేఔట్‌లోని ఓ షాపింగ్ మాల్‌ను ఆయన ప్రారంభించారు. నెల్లూరులోని చేపల పులుసు అంటే తనకు ఇష్టం అన్నారు. ఆయన్ను చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు.


