News February 10, 2025
బీటెక్ రవిని ప్రశ్నించిన విచారణాధికారి

తనని కడప జైల్‌లో డాక్టర్ చైతన్య రెడ్డి బెదిరించారని మాజీ మంత్రి హత్య కేసులో అప్రూవర్ దస్తగిరి పోలీసులను ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై పులివెందుల టీడీపీ ఇన్‌ఛార్జ్ బీటెక్ రవిని విచారణాధికారి రాహుల్ శ్రీరామ్ ప్రశ్నించారు. జైలులో దస్తగిరి బ్యారక్‌లో బీటెక్ రవి ఉన్నారు. ఈ నేపథ్యంలో దస్తగిరి బ్యారక్‌లోకి చైతన్య రెడ్డి వెళ్లాడా.. లేడా అని విచారణాధికారి బీటెక్ రవిని ప్రశ్నించినట్లు సమాచారం
Similar News
News April 17, 2026
కడపలో సీఐ, ఎస్ఐలపై బదిలీ వేటు

కడపలోని చిన్నచౌక్ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న సీఐ ఓబులేసు, ఎస్ఐ రాజ రాజేశ్వర్ రెడ్డిలను బదిలీ చేస్తూ కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. వీరిద్దరినీ విధుల్లో నుంచి తప్పించి కర్నూలు వీఆర్‌కు రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. విధుల్లో నిర్లక్ష్యం, ఇటీవల జరిగిన కొన్ని వివాదాస్పద అంశాలపై వచ్చిన ఫిర్యాదుల మేరకే ఈ బదిలీలు జరిగినట్లు చర్చ నడుస్తోంది.

బెల్ట్ షాపులు, నేరాలపై ఉక్కుపాదం: జిల్లా ఎస్పీ

కడప జిల్లాలో బెల్ట్ షాపులు, అక్రమ మద్యంపై ఉక్కుపాదం మోపాలని కడప ఎస్పీ నచికేత్ ఆదేశించారు. గురువారం జమ్మలమడుగు పోలీసులతో ఆయన నేర సమీక్ష జరిపారు. బహిరంగ మద్యపానం, గంజాయి, క్రికెట్ బెట్టింగ్, రౌడీయిజంపై కఠినంగా వ్యవహరించాలన్నారు. మహిళలపై నేరాలకు పాల్పడితే శిక్షలు తప్పవని, రద్దీ ప్రాంతాల్లో గస్తీ పెంచాలని సూచించారు. డ్రోన్లతో బహిరంగ మద్యం తాగేవారిని పట్టుకుని కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.