News February 10, 2025

కందుకూరు: ఉచితంగా రూ.45 వేల ఇంజెక్షన్

image

గుండెపోటు వచ్చినప్పుడు వేసే అత్యంత విలువైన టెనెక్టెప్లస్ ఇంజెక్షన్ కందుకూరు ప్రభుత్వ వైద్యశాలలో అందుబాటులో ఉందని డా. తులసిరామ్ తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. అకస్మాత్తుగా గుండెపోటు వచ్చిన ఒక గంట లోపు టెనెక్టెప్లస్ ఇంజెక్షన్ ఇవ్వగలిగితే రోగి ప్రాణాన్ని కాపాడవచ్చన్నారు. దీని ఖరీదు రూ.40 వేల నుంచి రూ.45 వేల వరకూ ఉంటుందని, కానీ ప్రభుత్వం దీన్ని ఉచితంగా అందిస్తుందని తెలిపారు.

Similar News

News November 7, 2025

ఉలవపాడు: రోడ్డు ప్రమాదంలో ఒకరి దుర్మరణం

image

ఉలవపాడు మండలం చాగల్లు–వీరేపల్లి మధ్య రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని వెనుక నుంచి గాయత్రి మిల్క్ వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో పాల వాహనం డ్రైవర్ రాకొండి దుర్గా మహేష్ (25) అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడిది మద్దిపాడు మండలం వెల్లంపల్లిగా స్థానికులు గుర్తించారు. ఇంకా వివాహం కాలేదని పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని ఉలవపాడు సీహెచ్‌సీకి తరలించి కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ అంకమ్మరావు తెలిపారు.

News November 7, 2025

వందేమాతరాన్ని ఆలపించిన నెల్లూరు కలెక్టర్

image

స్వాతంత్య్ర సంగ్రామంలో భారతీయులను ఏకతాటిపైకి తీసుకొచ్చి స్వాతంత్య్ర స్ఫూర్తిని రగిలించిన దేశభక్తి గేయం వందేమాతరం అని నెల్లూరు కలెక్టర్‌ హిమాన్షు శుక్లా కొనియాడారు. వందేమాతరం 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కలెక్టరేట్‌లో వందేమాతరం గేయాన్ని శుక్రవారం ఉదయం ఆలపించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ.. వందేమాతరం గేయాన్ని అందరూ గౌరవించాలని సూచించారు.

News November 7, 2025

నెల్లూరు: కాంట్రాక్టర్లపై పోలీసులకు ఫిర్యాదు

image

నెల్లూరు జిల్లా ఉదయగిరి(M) గంగిరెడ్డిపల్లి జగనన్న లేఅవుట్ కాంట్రాక్టర్లపై లబ్ధిదారులతో కలిసి హౌసింగ్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇళ్లు నిర్మించకుండా కాంట్రాక్టర్లు తమ్మిశెట్టి వెంకటేశ్వర్లు, దేవండ్ల పిచ్చయ్య నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపించారు. ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయకుండా తప్పించుకు తిరుగుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. మీ ఏరియాలోనూ కాంట్రాక్టర్లు ఇలాగే చేశారా?