News March 20, 2024
ఈ మూడు జట్ల కల నెరవేరేనా?

ఐపీఎల్లో 16 సీజన్లు గడిచినా మూడు జట్లు మాత్రం ఇప్పటివరకూ టైటిల్ అందుకోలేదు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లను దురదృష్టం వెంటాడుతూనే ఉంది. ఈ మూడు టీమ్‌లు ఫైనల్‌కు వెళ్లినా పరాజయమే పలకరించింది. ఆర్సీబీ పరిస్థితి మరీ విచారకరం. మూడు సార్లు ఫైనల్స్‌కు వెళ్లినా ఒక్కసారి కూడా ట్రోఫీని ముద్దాడలేకపోయింది. ఈ సారి ఎలాగైనా తమ రాత మార్చుకోవాలని ఈ జట్లు భావిస్తున్నాయి.
Similar News
News April 16, 2025
ఎంపీల అటెండెన్స్.. టాప్ ఎవరంటే?

TG: 24 జూన్ 2024 – 4 ఏప్రిల్ 2025 మధ్య పార్లమెంట్ సమావేశాలకు కాంగ్రెస్ MP చామల కిరణ్ కుమార్ 100 శాతం హాజరయ్యారు. కొండా విశ్వేశ్వర్ రెడ్డి 95 శాతం హాజరు నమోదు చేశారు. BJP MP ఈటల రాజేందర్ అత్యధికంగా 80 ప్రశ్నలు వేసి 91 శాతం సమావేశాలకు హాజరయ్యారు. డీకే అరుణ 73 ప్రశ్నలు అడిగి 88 శాతం హాజరయ్యారు. MIM MP అసదుద్దీన్ 21 చర్చల్లో పాల్గొన్నారు. నల్గొండ MP రఘువీర్ అతి తక్కువగా 8 ప్రశ్నలే అడిగారు.
News April 16, 2025
ఇండియన్ రైల్వేస్‌కు నేటితో 172 ఏళ్లు పూర్తి: అశ్వినీ వైష్ణవ్

భారతీయ రైల్వే వ్యవస్థ ప్రారంభమై నేటితో 172 సంవత్సరాలు పూర్తయ్యాయని కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ ట్వీట్ చేశారు. 1853 ఏప్రిల్ 16న బోరిబందర్- ముంబై-థానే మధ్య, సింద్, సుల్తాన్, సాహిబ్ అనే మూడు ఇంజిన్లతో రైలు నడిచిందని తెలిపారు. తొలి రైలులో 400మంది ప్యాసింజర్లు ఉండగా 34 కిలోమీటర్లు ప్రయాణం చేసిందని పేర్కొన్నారు. అప్పటి నుంచి నేటి వరకూ భారతీయ రైల్వే నిరంతరాయంగా సేవలందిస్తోందని ట్వీట్ చేశారు.
News April 16, 2025
రేషన్ కార్డు ఈ-కేవైసీ పూర్తి చేశారా?

AP: బియ్యం పంపిణీ ఆగిపోవద్దంటే లబ్ధిదారులు రేషన్ కార్డు e-KYCని ఈనెలాఖరులోగా పూర్తి చేయాలి. e-KYC స్టేటస్ కోసం epds1.ap.gov.in <