News February 10, 2025
శ్రీశైలం బ్రహ్మోత్సవాల్లో భక్తులకు ఉచితంగా లడ్డూ: ఆనం

AP: ఈ నెల 19 నుంచి మార్చి 1 వరకు శ్రీశైలం బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించనున్నట్లు మంత్రి ఆనం రాం నారాయణరెడ్డి తెలిపారు. భక్తులకు ఇబ్బందిలేకుండా తాగునీరు, ఆహారం అందిస్తామని చెప్పారు. శ్రీశైలం పార్కింగ్ నుంచి సత్రాల వరకు ఉచిత ప్రయాణం కల్పిస్తామన్నారు. ప్రతి భక్తుడికీ ఫ్రీగా లడ్డూ ప్రసాదం ఇస్తామని పేర్కొన్నారు. ఘాట్ రోడ్లపై ట్రాఫిక్‌ను డ్రోన్ల ద్వారా పర్యవేక్షిస్తామని వివరించారు.
Similar News
News February 3, 2026
ఫిబ్రవరి 03: చరిత్రలో ఈ రోజు

☛ 1468: అచ్చుయంత్రాన్ని కనుగొన్న జోహన్నెస్ గుటెన్‌బర్గ్ మరణం
☛ 1924: అమెరికా మాజీ అధ్యక్షుడు, నోబెల్ బహుమతి గ్రహీత ఉడ్రోవిల్సన్ మరణం.
☛ 1938: బాలీవుడ్ నటి వహీదా రెహమాన్ జననం
☛ 1963: RBI 23వ గవర్నర్ రఘురాం రాజన్ జననం
☛ 2002: ప్రముఖ సంగీత దర్శకుడు కె.చక్రవర్తి మరణం(ఫొటోలో)
☛ నేడు జాతీయ మహిళా వైద్యుల దినోత్సవం
News February 3, 2026
ప్రీమియం ఫోన్ల వైపు ఇండియన్స్.. వాల్యూ షేర్‌లో ఐఫోన్ టాప్

భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో యాపిల్ రికార్డు సృష్టించింది. 2025లో ఏకంగా 28% వాల్యూ షేర్‌ను దక్కించుకుని అగ్రస్థానంలో నిలిచింది. ఇండియన్స్ ప్రీమియం ఫోన్ల వైపు మొగ్గు చూపుతుండటమే దీనికి కారణమని కౌంటర్ పాయింట్ రీసెర్చ్ వెల్లడించింది. ఐఫోన్ 16 సిరీస్ సక్సెస్, ఈజీ ఫైనాన్స్, ఎక్స్ఛేంజ్ ఆఫర్లు యాపిల్‌కు కలిసొచ్చాయి. వాల్యూమ్ పరంగా భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్ 1%, విలువ పరంగా 8% పెరిగింది.
News February 3, 2026
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.


