News February 10, 2025

ఏపీలో లిక్కర్ ధరలు పెంపు!

image

AP: రాష్ట్రంలోని మందుబాబులకు బ్యాడ్ న్యూస్. మద్యంపై 15 శాతం మేర ధరలు పెంచాలని ఎక్సైజ్ శాఖ నిర్ణయించింది. ఇటీవల మద్యం అమ్మకాలపై మార్జిన్‌ను 14.5 నుంచి 20 శాతానికి పెంచిన విషయం తెలిసిందే. దీంతో ధరల పెంపు అనివార్యమైనట్లు అధికారవర్గాలు పేర్కొన్నాయి. ఇకపై 3 కేటగిరీలుగా(ఇండియన్ మేడ్, ఫారిన్ మేడ్, బీర్) మద్యం సరఫరా ఉంటుందని తెలిపాయి. రూ.99 మద్యం, బీర్లపై పెంపు ఉండదని చెప్పాయి.

Similar News

News January 12, 2026

మినుము పంట పూత, పిందె దశల్లో పల్లాకు తెగులు నివారణ ఎలా?

image

మినుములో పల్లాకు తెగులు లక్షణాలు గుర్తించిన వెంటనే నివారణ చర్యలు తీసుకోవాలి. ముందుగా ఈ తెగులును వ్యాప్తి చేసే తెల్లదోమ నివారణకు ఎకరాకు డైమిథోయేట్ 400ml లేదా థయోమిథాక్సాం 40గ్రా. లేదా అసిటామిప్రిడ్ 40 గ్రా. లేదా ఎసిఫేట్ 200 గ్రాములను 200 లీటర్ల నీటికి కలిపి మొక్కలు పూర్తిగా తడిచేలా పిచికారీ చేయాలి. దీంతో పాటు ఎకరానికి 20 చొప్పున పసుపు రంగు జిగురు అట్టలను అమర్చి ఈ తెగులును నియంత్రించవచ్చు.

News January 12, 2026

తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే 10% జీతం కట్: సీఎం

image

TG: తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసే ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం రేవంత్ వార్నింగ్ ఇచ్చారు. ఎవరైనా అలా చేస్తే ప్రతి నెలా జీతంలో 10 శాతం తల్లిదండ్రులకు అందించేలా చట్టం తెస్తామని స్పష్టం చేశారు. తల్లిదండ్రుల ఫిర్యాదులను పరిశీలించి పిల్లల జీతంలో నేరుగా 10 శాతం తల్లిదండ్రుల ఖాతాలోకి వెళ్లేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజాభవన్‌లో ‘ప్రణామ్’ వయోవృద్ధుల డే కేర్ సెంటర్లను సీఎం ప్రారంభించారు.

News January 12, 2026

దివ్యాంగుల వివాహానికి రూ.2 లక్షలు: రేవంత్

image

TG: దివ్యాంగుల వివాహానికి రూ.2 లక్షలు ఆర్థిక సాయం అందిస్తామని CM రేవంత్ ప్రకటించారు. దివ్యాంగులను ఇతరులు పెళ్లి చేసుకున్నా ఆర్థికసాయం అందిస్తామన్నారు. విద్య, ఉద్యోగాల భర్తీలో వారికి కోటాను కేటాయిస్తున్నట్లు ప్రజాభవన్‌లో ఓ కార్యక్రమంలో తెలిపారు. కుటుంబసభ్యుల్లా భరోసా కల్పిస్తూ వారికి రూ.50 కోట్లతో ఉపకరణాలు ఇస్తున్నట్లు వెల్లడించారు. అవకాశాలను ఉపయోగించుకుని ఆత్మస్థైర్యంతో ఎదగాలని పిలుపునిచ్చారు.