News February 10, 2025
జోగులాంబ: ఐదుగురు డ్రైవర్ల పై కేసులు నమోదు

డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపితే చర్యలు తీసుకుంటామని ట్రాఫిక్ ఎస్ఐ బాలచంద్రుడు అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలో వాహనాల తనిఖీల్లో భాగంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ అనుమతితో ఇసుకను తరలిస్తున్న డ్రైవర్లు తప్పనిసరిగా లైసెన్స్ కలిగి ఉండాలన్నారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపిన 5 మంది డ్రైవర్లపై కేసులు నమోదు చేసినట్లు వివరించారు.
Similar News
News March 23, 2026
కీలక బిల్లు: విద్వేష ప్రసంగాలు చేస్తే 7 ఏళ్ల జైలు

TG: విద్వేష ప్రసంగాలు చేసేవారి భరతం పట్టేలా కీలక బిల్లును GOVT ఇవాళ అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. ఇలాంటి ప్రసంగాలు చేస్తే తొలిసారి ₹50000 జరిమానా, 7 ఏళ్ల జైలు విధిస్తారు. రెండోసారి కూడా చేస్తే ₹1 లక్ష జరిమానా, 10 ఏళ్లు జైలు తప్పదు. ఇప్పటికే ఇలాంటి చట్టం కర్ణాటకలో ఉంది. కాగా పేరెంట్స్‌ను నిర్లక్ష్యం చేసే ఉద్యోగుల వేతనం నుంచి 10-15% కట్ చేసి వారికి అందించేలా మరో బిల్లునూ త్వరలో పెట్టనున్నారు.
News March 23, 2026
ప్రశాంతంగా పదో తరగతి పరీక్షలు: కలెక్టర్ రాహుల్ శర్మ

భూపాలపల్లి జిల్లాలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయని కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. సోమవారం జిల్లా కేంద్రంలోని సింగరేణి, గిరిజన ఆశ్రమ పాఠశాలల్లోని పరీక్షా కేంద్రాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరీక్షలు పారదర్శకంగా, క్రమశిక్షణతో నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
News March 23, 2026
సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి: కలెక్టర్

జిల్లాలో పునరుత్పాదక శక్తి వినియోగాన్ని పెంచుతూ విద్యుత్ ఖర్చులను తగ్గించుకునేందుకు ప్రతి కుటుంబం ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. రెడ్కో, విద్యుత్ శాఖల ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన యోజన ప్రచార రథాన్ని, కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ పథకం గృహ వినియోగదారులకు ఎంతో ప్రయోజనకరమని పేర్కొన్నారు.


