News February 10, 2025

కేసముద్రంలో నాలుగు కిలోల గంజాయి పట్టివేత

image

మహబూబాబాద్ జిల్లా కేసముద్రంలో 4కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. సీఐ సర్వయ్య తెలిపిన వివరాలిలా.. నమ్మదగిన సమాచారం మేరకు 3 వ్యక్తులు అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్నారని తెలిసింది. దీంతో ఎస్సై మురళీధర్ తన సిబ్బందితో కలిసి తనిఖీలు చేపట్టారు. ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు. వారి వద్ద తనిఖీ చేయగా 4కిలోల గంజాయి దొరికిందని సీఐ తెలిపారు.

Similar News

News September 19, 2025

HYD: 40 ప్రాంతాల్లో వరదలకు కారణం ఇదే..!

image

గ్రేటర్ వ్యాప్తంగా డ్రైనేజీ వ్యవస్థ జనాభాకు అవసరమైన స్థాయిలో లేకపోవడం, మరోవైపు సిల్ట్ భారీ మొత్తంలో పేరుక పోవడంతో అనేక చోట్ల నాలాలు పూడుకపోయాయి. ఇలాంటి పరిస్థితి దాదాపు 40 చోట్ల ఉన్నట్లు గుర్తించిన హైడ్రా ఎక్కడికక్కడ సిల్ట్ క్లియర్ చేయడంపై ఫోకస్ పెట్టినట్లు వివరించింది. త్వరలోనే అన్ని ప్రాంతాల్లో పనులు పూర్తి చేస్తామని పేర్కొంది.

News September 19, 2025

GWL: ‘రేవులపల్లిలో బ్రిడ్జి నిర్మించాలి’

image

రేవులపల్లి-నందిమల్ల మధ్య కృష్ణా నదిపై బ్రిడ్జి నిర్మించాలని రేవులపల్లి పరిసర గ్రామాల ప్రజలు కోరారు. కాంగ్రెస్ గద్వాల ఇన్‌ఛార్జ్ సరిత ఆధ్వర్యంలో మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డిని కలిసి వినతిపత్రం సమర్పించారు. జూన్ 28న జూరాల సందర్శన సమయంలో బ్రిడ్జిని ప్రాజెక్టుకు కొన్ని కిలోమీటర్ల దూరంలో నిర్మించాలని మీరు ప్రతిపాదించారని, ఇప్పుడు బ్రిడ్జిని మరోచోట నిర్మించేందుకు కుట్ర జరుగుతోందని ఆయనకు వివరించారు.

News September 19, 2025

నిర్మల్: క్రైస్తవ మైనారిటీల సమస్యలపై సమీక్ష

image

రాష్ట్ర క్రిస్టియన్ మైనారిటీ కమిషన్ ఛైర్మన్ దీపక్ జాన్, కలెక్టర్ అభిలాష అభినవ్ సమక్షంలో కలెక్టరేట్‌లో కార్యాలయంలో క్రైస్తవ మైనారిటీల సమస్యలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. అర్హులైన క్రైస్తవులు ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. తద్వారా వారు అభివృద్ధి సాధించవచ్చన్నారు.