News February 10, 2025

టీచర్ MLC అభ్యర్థిగా మల్లారెడ్డి నామినేషన్ దాఖలు

image

సిద్దిపేటకు చెందిన జగ్గు మల్లారెడ్డి టీచర్ MLC అభ్యర్థిగా సోమవారం కరీంనగర్ కలెక్టరేట్‌లో నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం మల్లారెడ్డి మాట్లాడుతూ.. ఈనెల 27న ఎమ్మెల్సీ పోలింగ్ ఉన్నందున తనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను కోరారు. తనకు మద్దతిచ్చి గెలిపిస్తే చట్టసభల్లో తన గొంతు వినిపిస్తానన్నారు. రాష్ట్రంలో టీచర్లు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానన్నారు.

Similar News

News March 14, 2025

స్టాలిన్ ప్రభుత్వంపై నిర్మల సీతారామన్ ఫైర్

image

తమిళనాడు బడ్జెట్ పత్రాల్లో <<15745743>>రూపీ(₹) గుర్తును<<>> తొలగించి రూ. అనే అక్షరాన్ని చేర్చడంపై కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఫైరయ్యారు. 2010లో కేంద్రం రూపీ సింబల్‌ను ఆమోదించిన సమయంలో ఎందుకు వ్యతిరేకించలేదని స్టాలిన్ సర్కారును ప్రశ్నించారు. ఇప్పుడు ఈ గుర్తును తిరస్కరించి తమిళ యువత సృజనాత్మకతను విస్మరించారని మండిపడ్డారు. కాగా రూపీ(₹) గుర్తును డిజైన్ చేసింది డీఎంకే నేత కుమారుడు ఉదయ కుమార్ కావడం గమనార్హం.

News March 14, 2025

వైసీపీ రాష్ట్ర రైతు విభాగం కార్యదర్శిగా మల్లయ్య యాదవ్

image

వైసీపీ రాష్ట్ర రైతు విభాగం కార్యదర్శిగా మల్లయ్య యాదవ్ ఎంపికయ్యారు. గుత్తి మండలం బేతపల్లికి చెందిన వైసీపీ నేతలు సూర్యనారాయణ, ఈశ్వరయ్య, తదితరులు మల్లయ్య యాదవ్‌ను ఆయన నివాసంలో కలిశారు. ముందుగా మల్లయ్యను శాలువాతో సత్కరించి, పూలమాల వేసి సన్మానించారు. రైతుల సమస్యల పట్ల పోరాడుతానన్నారు. తనను ఎంపిక చేసినందుకు వైఎస్ జగన్, గుంతకల్లు మాజీ ఎమ్మెల్యే వైవీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

News March 14, 2025

ఎంటెక్ ఫలితాల విడుదల

image

అనంతపురం జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాలలో ఫిబ్రవరి నెలలో నిర్వహించిన ఎంటెక్ 1వ, 2వ సెమిస్టర్ల రెగ్యులర్, సప్లిమెంటరీ (R21) పరీక్షల ఫలితాలు విడుదల చేసినట్లు కళాశాల ప్రిన్సిపల్ పీ.చెన్నారెడ్డి, వైస్ ప్రిన్సిపల్ కే.మాధవి ఓ ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు తమ ఫలితాల కోసం కళాశాలలోని అకాడమిక్ సెక్షన్‌ను సంప్రదించాలని సూచించారు.

error: Content is protected !!