News February 10, 2025
నిర్మల్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

1.నిర్మల్: నిర్మల్ జిల్లాకు త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి2.లోకేశ్వరం: ఫోన్ విషయంలో గొడవ.. చెరువులో దూకిన మహిళ3.లక్ష్మణాచంద మండలంలో 75,281 ధాన్యం సంచులు మాయం4.భైంసాలో 40 టన్నుల పీడీఎస్ బియ్యం సీజ్5.కుబీర్‌లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరికి గాయాలు6.నిర్మల్ : బస్ డిపో వద్ద ఆటో బోల్తా ఒకరికి తీవ్ర గాయాలు
Similar News
News January 8, 2026
అమెరికా నియమాలను ఉల్లంఘిస్తోంది: ఫ్రాన్స్ అధ్యక్షుడు

అమెరికా విదేశాంగ విధానాన్ని ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్, జర్మనీ ప్రెసిడెంట్ ఫ్రాంక్ వాల్టర్ ఖండించారు. ‘US క్రమంగా దాని మిత్రదేశాల్లో కొన్నింటి నుంచి దూరం జరుగుతోంది. ఇంతకాలం అది ప్రోత్సహిస్తూ వచ్చిన అంతర్జాతీయ నియమాలను ఉల్లంఘిస్తోంది. కొత్త వలసవాదం, సామ్రాజ్యవాదాన్ని ఫ్రాన్స్ తిరస్కరిస్తుంది’ అని మేక్రాన్ చెప్పారు. ప్రపంచం దోపిడీదారుల డెన్‌లా మారే ప్రమాదం ఉందని ఫ్రాంక్ వాల్టర్ అన్నారు.
News January 8, 2026
హన్మకొండ: గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే పురోగతిపై సమీక్ష

పరకాల రెవెన్యూ డివిజన్ పరిధిలో గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే పనుల పురోగతిపై కలెక్టర్ స్నేహ శబరీష్ గురువారం నేషనల్ హైవేస్, రెవెన్యూ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. 163 జి గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే నిర్మాణం కోసం పూర్తయిన భూ సేకరణ, రైతులకు పరిహారం చెల్లింపు, రహదారి నిర్మాణంలో ఉన్న సమస్యలపై కలెక్టర్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అదనపు కలెక్టర్ రవి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
News January 8, 2026
అద్దె బస్సుల యజమానుల సమ్మె నోటీసులు!

AP: RTC అద్దె బస్సుల యజమానులు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి సమ్మె నోటీసులిచ్చారు. బస్సు అద్దె పెంచాలని అందులో డిమాండ్ చేశారు. లేకపోతే ఈ నెల 12 నుంచి సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. స్త్రీశక్తితో అధిక రద్దీ వల్ల భారం పడుతోందని, అదనంగా నెలకు రూ.15-20వేల వరకు ఇవ్వాలని కోరుతున్నారు. రాష్ట్రంలో 2,500 వరకు అద్దె బస్సులుండగా, సమ్మెకు దిగితే సంక్రాంతి ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయి.


