News February 10, 2025

సంగారెడ్డి: టాలెంట్ టెస్ట్‌తో విద్యార్థుల ప్రతిభ వెలుగులోకి..

image

టాలెంట్ టెస్ట్‌తో విద్యార్థుల ప్రతిభ వెలుగులోకి వస్తుందని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు అన్నారు. సంగారెడ్డిలో పదవ తరగతి విద్యార్థులకు భౌతిక రసాయన శాస్త్రం టాలెంట్ టెస్ట్ సోమవారం ప్రారంభించారు. విద్యార్థులకు ఇలాంటి పరీక్షలు నిర్వహించడం అభినందనీయమని చెప్పారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Similar News

News March 16, 2026

ప్రేయసికి భర్తను ‘లీజు’కు ఇస్తానన్న భార్య.. కానీ!

image

మోసం చేసిన భర్తకు విడాకులు ఇవ్వకుండా అతనిని ప్రేయసికే అద్దెకు ఇవ్వడానికి సిద్ధమైందో భార్య. దీనిద్వారా ఖున్ క్వాంగ్‌ నెలకు ₹85వేలు డిమాండ్ చేసింది. ఈ ఘటన థాయిలాండ్‌లో జరిగింది. వీరికి వివాహమై 10 ఏళ్లయింది. గతేడాది ఓ మహిళతో భర్త అక్రమ సంబంధాన్ని భార్య గుర్తించింది. దీనిపై ప్రశ్నించగా ఇరువురూ విడిచి ఉండలేమన్నారు. దీంతో ఆమె అద్దె ప్రతిపాదన పెట్టగా ప్రేయసి ఒప్పుకుంది. కానీ భర్త అంగీకరించలేదు.

News March 16, 2026

విశాఖలో రోడ్డు ప్రమాదం.. తుని యువతి మృతి

image

విశాఖపట్నం BHPV వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువతులు మృతి చెందారు. స్కూటీపై వెళ్తుండగా డివైడర్‌ను ఢీకొన్న ప్రమాదంలో పార్వతీపురానికి చెందిన సీహెచ్ అనూష అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, తుని గవరపేటకు చెందిన ఆడారి కుసుమాంజలి మహాలక్ష్మి (19) చికిత్స పొందుతూ సోమవారం మరణించింది. ఈ ఘటనతో బాధితుల కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News March 16, 2026

సర్ఫరాజ్ అహ్మద్ రిటైర్మెంట్

image

పాకిస్థాన్ మాజీ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ ఇంటర్నేషనల్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు. ఇతను కెరీర్‌లో 54 టెస్టులు, 117 వన్డేలు, 61 టీ20లు ఆడారు. 6 సెంచరీలు, 35 హాఫ్ సెంచరీల సాయంతో 6,164 రన్స్ చేశారు. వికెట్ కీపర్‌గా 315 క్యాచ్‌లు పట్టారు. కెప్టెన్‌గా 2017లో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని అందించారు. U-19 సారథిగా 2006లో వరల్డ్ కప్ సాధించారు.