News February 11, 2025

సిద్దిపేట: ఇందిరమ్మ ఇళ్ల పనులు వెంటనే ప్రారంభించాలి: కలెక్టర్

image

సిద్దిపేట జిల్లాలోని 26 మండలాల్లో ఎంపిక చేసిన ప్రతి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల శాంక్షన్ పత్రాలు అందజేసిన వారి ఇండ్ల పనులను వెంటనే ప్రారంభించాలని అధికారులకు కలెక్టర్ ఎం. మను చౌదరి  తెలిపారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో ఎంపిడిఓ, పంచాయతీ రాజ్, ఆర్ అండ్‌బి ఇంజినీరింగ్ అధికారులతో జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించారు.

Similar News

News April 16, 2026

సిద్దిపేట: నిరుద్యోగుల ప్రత్యేక కోచింగ్

image

సిద్దిపేట ఐటీ టవర్‌లో ఉన్న టాస్క్ కేంద్రంలో నిరుద్యోగ యువతి, యువకులకు టెక్నికల్, నాన్ టెక్నికల్ కోర్సులపై శిక్షణ ఇస్తునట్టు టాస్క్ మేనేజర్ నరేందర్ గౌడ్ తెలిపారు. పలు రకాల కోర్సులు అందుబాటులో ఉన్నాయని, ఈ నెల 16,17,18 తేదీలలో ఐటీ టవర్ టాస్క్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. బీటెక్, డిగ్రీ పాస్ అయిన యువత అర్హులన్నారు. మరిన్ని వివరాలకు టాస్క్ కేంద్రంలో సంప్రదించాలన్నారు.

News April 16, 2026

కర్నూలు: అనారోగ్యం బారిన పడినా.. ఇంటర్‌లో అద్భు ప్రతిభ

image

కర్నూలు(D) పెద్దకడుబూరుకు చెందిన బొగ్గుల హరిత ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో అద్భుత ప్రతిభ కనబరిచింది. వ్యవసాయ కూలీలు బొగ్గుల పరమేశ్, జ్యోతి దంపతుల కుమార్తె హరిత 6 నెలలుగా అనారోగ్యంతో బాధపడినా ధైర్యంగా కోలుకుని పరీక్షలకు హాజరై 1000 మార్కులకు 956 మార్కులు సాధించింది. ఆమె విజయంపై గ్రామ ప్రజలు, ఉపాధ్యాయులు అభినందనలు తెలిపారు. హరిత భవిష్యత్తు మరింత ఉజ్వలంగా ఉండాలని ఆకాంక్షించారు.

News April 16, 2026

బాహ్యరూపం చూసి అంచనా వేయొద్దు!

image

మిరెము గింజ చూడ మీద నల్లగనుండు
కొరికి చూడ లోనంజురు మనును
సజ్జనులగువారి సార మిట్లుండురా
విశ్వదాభిరామ! వినుర వేమ!!
తాత్పర్యం: మిరియపు గింజ పైకి నల్లగా, అందవిహీనంగా ఉన్నప్పటికీ కొరికినప్పుడు దాని పనితనం తెలుస్తుంది. అలాగే సజ్జనులు పైకి సామాన్యంగా కనిపించినా వారి లోపల అపారమైన జ్ఞానం, మంచి గుణాలు ఉంటాయి.
<<-se>>#PADHYAM<<>>