News February 11, 2025
జనగామ జిల్లాలో నేటి టాప్ న్యూస్!

> దొడ్డి కొమురయ్య పాట షూటింగ్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే
> పాలకుర్తి సోమేశ్వర ఆలయంలో జాతర ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించిన కలెక్టర్
> సోమేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి
> మహా ధర్నాకు బయలుదేరిన ఎస్ఎఫ్ఐ నేతలు
> సాంఘిక సంక్షేమ వసతి గృహాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్
> ఓవరాల్ ఛాంపియన్ షిప్‌గా నిలిచిన లక్ష్మీ నారాయణపురం విద్యార్థులు.
Similar News
News September 16, 2025
ఆస్కార్ విన్నర్, హాలీవుడ్ ఐకాన్ రాబర్ట్ రెడ్‌ఫోర్డ్ మృతి

హాలీవుడ్ లెజెండ్, ఆస్కార్ అవార్డు విన్నింగ్ నటుడు & డైరెక్టర్ రాబర్ట్ రెడ్‌ఫోర్డ్ (89) కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో ఆయన మరణించినట్లు రాబర్ట్ సన్నిహితుడు సిండి బెర్గర్ వెల్లడించారు. 1960 నుంచి ఇంగ్లిష్ సినిమాలకు ఆయన నటుడు, నిర్మాత, దర్శకుడిగా సేవలందించారు. కెప్టెన్ అమెరికా, అవెంజర్స్ ఎండ్ గేమ్ వంటి సూపర్ హిట్ సినిమాల్లో ఆయన కీలక పాత్రల్లో నటించారు.
News September 16, 2025
దేవాదాయ భూముల్లో ఉత్సవ్‌పై హైకోర్టు ఆగ్రహం

దేవాదాయ భూముల్లో విజయవాడ ఉత్సవ్ నిర్వహించడంపై దాఖలైన పిటిషన్‌పై మంగళవారం హైకోర్టులో విచారణ జరిగింది. దేవాదాయ భూములను వాణిజ్య అవసరాలకు ఉపయోగించవద్దని, ఆ భూముల్లో మట్టి, కంకర, గ్రావెల్ వెంటనే తొలగించాలని హైకోర్టు ఆదేశించింది. 56 రోజులకు తమ ఆధీనంలోని భూములను దేవాదాయశాఖ లీజుకు ఇవ్వగా.. ఆ భూములను యథాస్థితికి తీసుకురావాలని హైకోర్టు ఆదేశాలిచ్చింది.
News September 16, 2025
చిత్తూరు జిల్లాలో లక్ష సంతకాలు సేకరిస్తాం: భాస్కర్

దేశంలో ఓటర్ల జాబితాలో అవకతవకలపై చేపడుతున్న ఉద్యమానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పోటుగారి భాస్కర్ పిలుపునిచ్చారు. చిత్తూరులో ఆయన మాట్లాడుతూ.. ఓటు చోరీపై చిత్తూరు జిల్లాలో లక్ష సంతకాల సేకరిస్తామని చెప్పారు. ప్రతి పార్టీ బీజేపీకి బానిసలా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. జీడీ నెల్లూరు ఇన్‌ఛార్జ్ రమేశ్, నేతలు పాల్గొన్నారు.