News February 11, 2025

గద్వాల: మయూర వాహనంపై చెన్నకేశ్వర స్వామి

image

జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణంలోని కోటలో వెలిసిన శ్రీ భూలక్ష్మీ చెన్నకేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా సోమవారం స్వామివారి కల్యాణం నిర్వహించి అభిషేకాలు, పూజలు నిర్వహించారు. అనంతరం సాయంత్రం స్వామిఅమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను మయూరవాహనంపై ఉంచి పూలమాలలతో, అరటి తోరణాలతో అలంకరణ చేసి ఆలయ ప్రాంగణంలో భజనలు చేస్తూ ఊరేగింపు నిర్వహించారు.

Similar News

News March 23, 2026

పెద్దపల్లి: ‘ఈనెల 31 వరకు ప్రత్యేక వైద్య శిబిరాలు’

image

జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ఈనెల 31 వరకు ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు డీఎంహెచ్‌ఓ డాక్టర్ ప్రమోద్ కుమార్ తెలిపారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఇప్పటికే 18 కేంద్రాలలో శిబిరాలు నిర్వహించామని, మిగిలిన కేంద్రాలలో ఈ నెలాఖరు వరకు పూర్తి చేస్తామని వెల్లడించారు. 24 రెసిడెన్షియల్ పాఠశాలల వద్ద క్యాంపులు నిర్వహించామని తెలిపారు.

News March 23, 2026

దృశ్యం-3 రిలీజ్ వాయిదా

image

మలయాళ నటుడు మోహన్‌లాల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న దృశ్యం-3 సినిమా విడుదల వాయిదా పడింది. తన పుట్టిన రోజైన మే 21న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు మోహన్‌లాల్ ఇన్‌స్టాలో వెల్లడించారు. ఈ మూవీని ఏప్రిల్ 2న రిలీజ్ చేస్తామని గతంలో మేకర్స్ ప్రకటించారు. జీతూ జోసెఫ్ తెరకెక్కించిన దృశ్యం 1, 2 చిత్రాలు సూపర్ హిట్ కాగా, వాటికి కొనసాగింపుగా మూడో భాగం వస్తోంది.

News March 23, 2026

విశాఖ: యాక్సిడెంట్.. తల్లి కళ్ల ఎదుటే కుమార్తె మృతి

image

పాత గాజువాక జంక్షన్‌లో సోమవారం రాత్రి ప్రమాదం జరిగింది. కొరమండల్ ప్రాంతానికి చెందిన తల్లి కూతుర్లు స్కూటీపై వెళుతుండగా లారీ ఢీకొనడంతో కుమార్తె మల్లపురెడ్డి స్వాతి అక్కడికక్కడే మృతి చెందింది. ఈ సంఘటనతో గాజువాక జంక్షన్‌లో కలకలం రేగింది. కళ్ల ఎదుట కూతురు చనిపోవడంతో ఆ తల్లి తల్లడిల్లి పోయింది. ఈ ప్రమాదంలో తల్లి స్వల్ప గాయాలతో బయటపడింది. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.