News February 11, 2025

శ్రీవారికి పట్టు వస్త్రాలను సమర్పించిన కలెక్టర్

image

యాదగిరిగుట్టలో పాత గుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. కలెక్టర్ హనుమంతరావు కళ్యాణ మహోత్సవంలో స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. ఆలయ ఈవో భాస్కరరావు భక్తులు తదితరులు పాల్గొన్నారు.

Similar News

News November 14, 2025

గోపీనాథ్ ‘లీడ్ బ్రేక్’ చేసిన నవీన్

image

జూబ్లీహిల్స్‌లో అంచనాలకు మించి నవీన్ యాదవ్ దూసుకెళ్తున్నారు. ఆయనకు 10 వేలకు అటు ఇటుగా మెజార్టీ రావచ్చని మెజార్టీ సర్వేలు చెప్పాయి. అయితే 9వ రౌండ్ ముగిసేసరికే 19వేల ఆధిక్యంలో ఉన్నారు. ఈ సెగ్మెంట్‌లో దివంగత MLA మాగంటి గోపీనాథ్ 2014లో 9,242, 2018లో 16,004, 2023లో 16,337 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఈ సెగ్మెంట్లో అత్యధిక మెజార్టీ రికార్డ్ విష్ణు (2009లో కాంగ్రెస్ నుంచి 21,741 లీడ్) పేరిట ఉంది.

News November 14, 2025

AcSIRలో 16 ఉద్యోగాలు.. అప్లై చేశారా?

image

అకాడమీ ఆఫ్ సైంటిఫిక్& ఇన్నోవేటివ్ రీసెర్చ్(<>AcSIR<<>>)లో 16 పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. సంబంధిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ, మాస్టర్ డిగ్రీతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అసిస్టెంట్ డైరెక్టర్, Sr మేనేజర్, మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్, ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. వెబ్‌సైట్: https://acsir.res.in/

News November 14, 2025

కృష్ణా: రేపటి నుంచి మహిళలకు స్వయం ఉపాధి శిక్షణ

image

మహిళలకు రేపటి నుంచి స్వయం ఉపాధి శిక్షణ ఇవ్వనున్నట్లు నైపుణ్యాభివృద్ధి మహిళా సాధికారత కేంద్రం జిల్లా మేనేజర్ ఎస్. జుబేదా పర్వీన్ శుక్రవారం తెలిపారు. పామర్రు (M) నిమ్మకూరు ఎన్టీఆర్ నైపుణ్యాభివృద్ధి, మహిళా సాధికారత కేంద్రంలో 18-35 వయసు కలిగిన మహిళలకు డొమెస్టిక్ డేటా ఎంట్రీ ఆపరేటర్, అసిస్టెంట్ బ్యూటీ తెరపిస్ట్, జనరల్ డ్యూటీ నర్సింగ్ అసిస్టెంట్, మగ్గం వర్క్‌లలో శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.