News February 11, 2025

రాజన్న సిరిసిల్ల జిల్లా ముఖ్యాంశాలు

image

సమగ్ర కుటుంబ సర్వే మళ్లీ చేయాల్సిందే: పోలాస నరేందర్@శివరాత్రి భద్రత ఏర్పాట్లపై కలెక్టర్ సమీక్ష@ప్రజావాణికి 121 దరఖాస్తులు@కరాటే పోటీలో తొమ్మిదో తరగతి విద్యార్థి సత్తా @రాజన్న సన్నిధిలో క్యూ లైన్ క్లియర్ చేస్తున్న ఈవో వినోద్ రెడ్డి@ఎమ్మెల్సీ అభ్యర్థి నామినేషన్లో వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్@పార్కింగ్‌కు నిలయాలుగా చలువ పందిళ్లు@గుమ్మి పుల్లయ్య పోరాటం స్ఫూర్తి: సీపీఐ నేతలు

Similar News

News March 20, 2026

హామీలను అటకెక్కించిన బడ్జెట్: సీపీఎం

image

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజలను మభ్యపెట్టేలా ఉందని సీపీఎం సిద్దిపేట జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి విమర్శించారు. మొత్తం 3,24,234 కోట్ల భారీ బడ్జెట్‌లో పేదలకు ఇచ్చిన ప్రధాన హామీలకు నిధుల కేటాయింపులు చేయకుండా ప్రభుత్వం వాటిని విస్మరించిందని మండిపడ్డారు. ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయకుండా కాలయాపన చేయడం సరికాదని ఆయన ధ్వజమెత్తారు.

News March 20, 2026

రేపు, ఎల్లుండి వర్షాలు: APSDMA

image

బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనంతో పాటు కర్ణాటక, తమిళనాడు మీదుగా ద్రోణి విస్తరించి ఉందని APSDMA తెలిపింది. దీని ప్రభావంతో శనివారం, ఆదివారాల్లో వర్షాలు కురుస్తాయని పేర్కొంది. రేపు అన్ని జిల్లాల్లో పిడుగులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఎల్లుండి విజయనగరం, విశాఖ, అనకాపల్లి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో వానలు పడతాయని తెలిపిింది.

News March 20, 2026

పోలీసులు అప్రమత్తంగా ఉండాలి: ప్రకాశం SP

image

రంజాన్ సందర్భంగా ప్రకాశం జిల్లా ముస్లిం సోదరులకు ఎస్పీ హర్షవర్ధన్ రాజు శుభాకాంక్షలు తెలిపారు. పవిత్ర మాసంలో ఉపవాసాలు, ప్రార్థనలు, దానధర్మాలు ఎంతో గొప్పవని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖసంతోషాలు నెలకొనాలని ఆకాంక్షించారు. పండగ సందర్భంగా మసీదులకు భారీగా వచ్చే భక్తులను దృష్టిలో ఉంచుకుని పోలీస్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణ చేపట్టాలని ఆదేశించారు.