News February 11, 2025
KMR: ‘యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాం’: షబ్బీర్ అలీ

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించామని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు. ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ MLC స్థానానికి నరేందర్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి షబ్బీర్ అలీ హాజరై మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ పట్టభద్రుల అభ్యర్థి నరేందర్ రెడ్డిను పట్టభద్రులు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.
Similar News
News March 9, 2026
CI రవి నాయక్, SI ప్రసాద్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు

కృష్ణపట్నం సర్కిల్ సీఐ రవి నాయక్, ముత్తుకూరు ఎస్ఐ ప్రసాద్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు పడింది. పొక్సో కేసు ముద్దాయి విషయంలో అలసత్వం వహించారనే ఆరోపణలతో వీరిని సస్పెండ్ చేస్తూ గుంటూరు రేంజ్ ఐజీ సర్వ శ్రేష్ట త్రిపాఠి ఉత్తర్వులు జారీ చేశారు. ఓకే సర్కిల్ పరిధిలోని ఎస్ఐ, సీఐ సస్పెండ్‌తో కలకలం రేగింది.
News March 9, 2026
శ్రీకాకుళం: మూడు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన యువతి

శ్రీకాకుళం నగరం జడ్పీ ఎదురుగా APHB కాలనీకి చెందిన డబ్బీరు నిఖిత ఇటీవల మూడు ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికైంది. శ్రీకాకుళం రూరల్ నైర వ్యవసాయ కళాశాలలో అగ్రికల్చరల్ బిఎస్సీ, భువనేశ్వర్లో ప్రైవేట్ యూనివర్సిటీలో ఎమ్మెస్సీ పూర్తి చేసింది. ఐబీపీఎస్ పరీక్ష ద్వారా క్లర్క్ పీవో ఉద్యోగాలకు, అలాగే ఎస్బీఐలో క్లర్క్ పోస్టుకు ఎంపికైంది. రెండు ఉద్యోగాలు ఇంటర్వ్యూ దశలో ఉన్నాయి.
News March 9, 2026
ఓటమిని ఓప్పుకోని యోధుడు ❤️‘సన్’జూ!

చీకటిని చీల్చి నిప్పులు కక్కుతూ సూర్యుడెలా ఉదయిస్తాడో సంజూ అలా వెలిగాడు ఈ WCలో. తొలుత జట్టులో చోటు దక్కకపోయినా నిరాశ చెందలేదు. తనకూ ఛాన్స్ వస్తుందనే ఓపికతో ముందుకు సాగారు. నిరీక్షణకు తెరపడగానే సింహంలా గర్జించారు. అది ఎంతలా అంటే 140 కోట్ల మంది భారతీయులు గర్వించేలా. IND జట్టు కప్పును ముద్దాడేలా. జీవితంలో ఎత్తుపల్లాలు సహజమే. ఓటమిని ఒప్పుకోకుండా సంజూలా ముందుకు సాగడమే మనం నేర్చుకోవాలి. ఏమంటారు?


