News February 11, 2025

మహిళలకు ఆరోగ్య సూత్రాలు వివరించాలి: డీఆర్డీఓ

image

మహిళా సంఘాల సభ్యులకు 10 ఆరోగ్య సూత్రాలు తెలపాలని డీఆర్డీఓ జ్యోతి అన్నారు. సంగారెడ్డిలో ఆరోగ్య సూత్రాలపై అవగాహన సమావేశం సోమవారం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. అవగాహన కల్పించేందుకు శిక్షణ సమావేశం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. సమావేశంలో అదనపు డీఆర్డీఓలు జంగారెడ్డి, బాల్ రాజ్, డీపీఎంలు మల్లేష్, జయశ్రీ తదితరులు పాల్గొన్నారు.

Similar News

News April 2, 2026

రేపు వడగాలుల ఎఫెక్ట్ ఎక్కడంటే?

image

AP: రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. ఇవాళ కడప(D) పొట్టిపాడులో 40.7 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైనట్లు APSDMA వెల్లడించింది. రేపు అల్లూరి, మన్యం, పోలవరం, శ్రీకాకుళం, విజయనగరం, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాల్లోని 8 మండలాల్లో తీవ్ర వడగాలులు, 17 మండలాల్లో వడగాలులు వీస్తాయని తెలిపింది. శుక్రవారం దాదాపు 58 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

News April 2, 2026

జగిత్యాల: విద్యుత్ బకాయిలపై అదనపు కలెక్టర్‌తో చర్చ

image

గ్రామపంచాయతీలకు సంబంధించిన పెండింగ్ విద్యుత్ బకాయిల వసూలుపై చర్యలు తీసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ రాజా గౌడ్‌ను విద్యుత్ శాఖ అధికారులు కలిశారు. సూపరింటెండెంట్ ఇంజనీర్ సుదర్శనం బకాయిల జాబితాను అందజేసి, బిల్లులు సకాలంలో చెల్లించేలా చర్యలు చేపట్టాలని కోరారు. బకాయిల పరిష్కారానికి సమన్వయంతో ముందుకు వెళ్లాలని సూచించారు. ఈ సమావేశంలో డివిజనల్ ఇంజనీర్ గంగారం, ఎస్‌ఏఓ తదితరులు పాల్గొన్నారు.

News April 2, 2026

KNR: నూతన ఆర్థిక సంవత్సరానికి ఘన స్వాగతం

image

కరీంనగర్ జిల్లా ట్రెజరీ కార్యాలయంలో నూతన ఆర్థిక సంవత్సరానికి ఉద్యోగులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జిల్లా ట్రెజరీ అధికారి నాగరాజు కేక్ కట్ చేసి, ఉద్యోగులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నూతన ఆర్థిక సంవత్సరం అభివృద్ధి, పారదర్శకతకు దారితీయాలని, ప్రభుత్వ లక్ష్యాల సాధనలో అందరూ సమన్వయంతో పని చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ట్రెజరీ అధికారులు ఉద్యోగులు పాల్గొన్నారు.