News February 11, 2025
MNCL: ప్రతి పోలీస్ స్టేషన్‌లో సైబర్ వారియర్లు: CP

సైబర్ నేరాల కట్టడిపై తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (TSCSB) ఆదేశాల మేరకు కమిషనరేట్‌లో ప్రత్యేక దృష్టి సారించినట్లు జరిగిందని శ్రీనివాస్ పేర్కొన్నారు. CP మాట్లాడుతూ.. సైబర్ నేరానికి గురైతే కంగారు పడకుండా ఫోన్ కాల్ చేస్తే సైబర్ వారియర్ అందుబాటులోకి వస్తారన్నారు. సైబర్ వారియర్స్ 1930ఫోనులో ఫిర్యాదులను స్వీకరిస్తారన్నారు. నేరాన్ని నివేదించడం, అనుమానిత ఐడెంటిఫైయర్లను విశ్లేషించడం జరుగుతుందన్నారు.
Similar News
News March 22, 2026
ఆ 2 గంటలు చాలా ముఖ్యం!

<<19446288>>సైబర్<<>> మోసాలకు గురైతే ఆందోళన చెందకుండా వెంటనే 1930 నంబర్‌కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచిస్తున్నారు. అలాగే <
News March 22, 2026
HYD: బిల్డింగ్ రూల్స్‌లో కీలక మార్పులు

ప్రభుత్వం బిల్డింగ్ రూల్స్‌లో కీలక మార్పులు చేస్తూ కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. ఇకపై 21మీ. పైబడిన భవనాలను హైరైజ్‌గా పరిగణిస్తారు. భవన నిర్మాణ అనుమతులకు 50% TDR తప్పనిసరి కాగా, ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ పొందేలోపు మిగిలిన 50% చెల్లించాలి. రోడ్డు వెడల్పును బట్టి అదనపు అంతస్తులకు అనుమతిస్తారు. సెట్ బ్యాక్ సడలింపులు అదనపు అంతస్తుల వినియోగంలో TDR లోడింగ్‌ను తప్పనిసరి చేస్తూ నిబంధనలు సవరించింది.
News March 22, 2026
TN పడవలు రాకుండా చూడండి.. కేంద్రానికి ఏపీ ప్రభుత్వం లేఖ

AP: తమిళనాడు మత్స్యకార పడవలు ఏపీ సముద్ర జలాల్లోకి అక్రమంగా ప్రవేశిస్తున్నాయని కేంద్రం, తమిళనాడు ప్రభుత్వాలకు రాష్ట్ర మత్స్య శాఖ లేఖ రాసింది. దీని వల్ల 162 తీర గ్రామాలకు చెందిన స్థానిక మత్స్యకారులు ఆందోళనకు గురవుతున్నారని పేర్కొంది. TN పడవల రాక ఇక్కడి వారి జీవనానికి ముప్పుగా మారిందని తెలిపింది. త్వరగా స్పందించి అవి AP సముద్ర జలాల్లోకి రాకుండా చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని రాష్ట్ర సర్కార్ కోరింది.


