News February 11, 2025

మహాశివరాత్రి ఏర్పాట్ల సమీక్ష లో పాల్గొన్న మంత్రి అనగాని

image

శ్రీశైలంలో మహాశివరాత్రి ఏర్పాట్లపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి, రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ పాల్గొన్నారు. సోమవారం జరిగిన సమీక్ష సమావేశంలో ఆయన సహచర మంత్రులతో కలిసి ఏర్పాట్లలో చేపట్టవలసిన చర్యలను వివరించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఆనం రామనారాయణ, వంగలపూడి అనిత తదితరులు పాల్గొన్నారు.

Similar News

News January 8, 2026

జనవరి 8: చరిత్రలో ఈరోజు

image

* 1642: ప్రముఖ భౌగోళిక శాస్త్రజ్ఞుడు గెలీలియో మరణం. * 1942: భౌతిక శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ జననం * 1962: లియోనార్డో డావిన్సీ వేసిన ‘మోనాలిసా’ పెయింటింగ్‌ను USలో తొలిసారి ప్రదర్శించారు. * 1975: మ్యూజిక్ డైరెక్టర్ హ్యారిస్ జైరాజ్ పుట్టినరోజు * 1983: హీరో తరుణ్ బర్త్‌డే (ఫొటోలో) * 1987: IND మాజీ క్రికెటర్ నానా జోషి మరణం

News January 8, 2026

కేరళలో ఫేక్ డిగ్రీ రాకెట్.. ఆస్ట్రేలియాలో దుమారం!

image

కేరళలో బయటపడిన ఫేక్ డిగ్రీ రాకెట్ ఆస్ట్రేలియాలో దుమారం రేపుతోంది. నకిలీ సర్టిఫికెట్లతో వస్తున్న విదేశీ విద్యార్థులను ప్రభుత్వం అడ్డుకోవడం లేదని ఆసీస్ సెనేటర్లు మండిపడుతున్నారు. వాటితోనే ఇక్కడ చదువుకుని, ఉద్యోగాలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. కాగా ఫేక్ డిగ్రీలు అమ్ముతున్న 11 మందిని ఇటీవల కేరళ పోలీసులు అరెస్టు చేశారు. నిందితులు 10 లక్షల మందికి నకిలీ సర్టిఫికెట్లు ఇచ్చి ఉంటారని భావిస్తున్నారు.

News January 8, 2026

జగిత్యాల: ఈ గ్రామం ఐడియాను మెచ్చుకోవాల్సిందే!

image

జగిత్యాల(D) కథలాపూర్(M) బొమ్మెనలో ఇటీవల ఎన్నికైన గ్రామ పంచాయతీ నూతన పాలక వర్గం తీసుకున్న నిర్ణయంపై హర్షం వ్యక్తమవుతోంది. గ్రామంలోని యువత మత్తు పదార్థాలకు, గంజాయికి అలవాటు పడకుండా, వారి భవిష్యత్ నాశనం అవకుండా ముందు జాగ్రత్తగా గ్రామంలో గంజాయి విక్రయాలు నిషేధిస్తున్నట్లు గ్రామ అభివృద్ధి కమిటీకి లేఖ రాసింది. అమ్మితే రూ.5 లక్షల జరిమానా, సాక్ష్యాలతో పట్టుకున్న వారికి రూ.2 లక్షల నజరానా ప్రకటించారు.