News February 11, 2025

పదేళ్ల అభివృద్ధి ఏడాదిలో జరిగింది : మంత్రి సురేఖ

image

గ‌త పదేళ్లలో జరగని అభివృద్ధి కాంగ్రెస్ ఏడాది పాలనలో జరిగిందని మంత్రి కొండా సురేఖ అన్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి నామినేషన్ ర్యాలీలో సోమవారం పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, సహచర మంత్రులతో కలిసి కొండా సురేఖ పాల్గొన్నారు. ఇచ్చిన హామీ మేరకు ఉచిత బస్సు, ఉచిత కరెంట్, రైతు భరోసా, రైతు రుణమాఫీ, 500 గ్యాస్ సిలిండర్‌ను అమలు చేశామన్నారు.

Similar News

News March 8, 2026

అనంతబాబు భార్యపై నాన్ బెయిలబుల్ వారెంట్

image

AP: డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు భార్య లక్ష్మీదుర్గకు రాజమండ్రి ఎస్సీ, ఎస్టీ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో సిట్ ఆమెను ఇటీవల ఈ కేసులో ఏ2గా చేర్చింది. ఈ మేరకు రాజమండ్రి కోర్టులో ఛార్జ్‌షీట్ దాఖలు చేయగా విచారణ చేపట్టింది. తాజాగా నాన్ బెయిలబుల్ వారెంట్ ఇచ్చింది. కోర్టు ఆదేశాలతో పోలీసులు ఆమె కోసం గాలిస్తున్నారు.

News March 8, 2026

రాష్ట్రపతి ఘటన: మమత సర్కార్‌పై కిషన్ రెడ్డి ఫైర్

image

బెంగాల్ ప్రభుత్వం రాష్ట్రపతి <<19322594>>ద్రౌపదీ ముర్ము<<>> పట్ల వ్యవహరించిన తీరు దురదృష్టకరమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. సంతాళీ తెగ సమ్మేళనాన్ని ఉద్దేశపూర్వకంగానే ఆ జనాభా తక్కువ ఉన్న చోట నిర్వహించడం, కనీస ప్రొటోకాల్ పాటించకుండా CM మమతా బెనర్జీ గైర్హాజరు కావడం గిరిజన జాతులను అవమానించడమేనని విమర్శించారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న వారిని రాజకీయాల్లోకి లాగడం ఏమాత్రం సరికాదని ధ్వజమెత్తారు.

News March 8, 2026

వాల్మికిపురం: స్కూటర్ ఢీకొని తల్లి మృతి.. బిడ్డకు సీరియస్

image

స్కూటర్ ఢీకొని తల్లి మృతి చెందడంతో ఆమె కుమారుడు పరిస్థితి ఆందోళనకరంగా మారింది. శనివారం రాత్రి వాల్మీకిపురం మండలంలో జరిగిన ఘటనపై ఎస్సై తిప్పేస్వామి వివరించారు. గుర్రంకొండ మండలం రామాపురంకి చెందిన మురళి భార్య రెడ్డిలక్ష్మి ఆమె కుమారుడు బాలాజీ బైకులో సొంతపనిపై చింతపర్తికి వచ్చారు. పనిముగించుకుని తిరిగి స్వగ్రామానికి బైకులో వెళుతుండగా.. వాల్మీకిపురం బైపాస్‌లో స్కూటర్ ఢీకొని తల్లి మృతి చెందింది.