News February 11, 2025
ప్రభుత్వాసుపత్రిలో కాన్పులను పెంచాలి: DMHO

కోదాడలో కాపుగల్లు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని, కోదాడ పట్టణ ఆరోగ్య కేంద్రాన్ని సోమవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కోట చలం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించాలని పలు సూచనలు చేశారు. ప్రభుత్వ ఆస్పత్రిలో కాన్పులు, రికార్డులు నిర్వహణ అంశాలపై ఆరోగ్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని వివరించారు.
Similar News
News January 11, 2026
మేడారంలో 85 శాతం పనులు పూర్తి: భట్టి

మేడారంలో 85% పనులు పూర్తయ్యాయని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు. మిగిలిన పనులు ఈనెల 15వ తేదీ వరకు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. జాతర పనులు పూర్తిచేసిన వెంటనే 24 గంటల్లో బిల్లులు మంజూరు చేస్తున్నామని అన్నారు. గతంలో జాతర నిర్వహణకు రూ.75 కోట్లు, రూ.100 కోట్లు ఖర్చు చేస్తే తమ ప్రభుత్వం రూ.251 కోట్లు ఖర్చు చేస్తుందన్నారు.
News January 11, 2026
వరంగల్‌లో ఇండోర్ స్టేడియంకు నిధులివ్వండి: రాఘవరెడ్డి

వరంగల్ జిల్లాలో ఇండోర్ స్టేడియంకు రూ.1.50 కోట్ల నిధులు మంజూరు చేయాలని మంత్రి వాకిటి శ్రీహరిని రాష్ట్ర ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి కోరారు. రాష్ట్రంలో ఉద్యోగాలలో స్పోర్ట్స్‌కు రిజర్వేషన్లను తీసుకురావాలన్నారు. స్టేడియంకు ఎస్టిమేట్స్ తీసుకువస్తే నిధులు మంజూరు చేసేలా చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.
News January 11, 2026
మహానందిలో గిరిజన పాఠశాల విద్యార్థి మృతి

మహానందిలోని గిరిజన ఆశ్రమ పాఠశాలలో చదువుతున్న విద్యార్థి విజయ్ కుమార్ తలకు కడ్డీలు గుచ్చుకొని తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విజయ్ కుమార్(13) కోలుకోలేక ఆదివారం మృతి చెందినట్లు మహానంది పోలీసులు తెలిపారు. గోస్పాడు మండలం సాంబవరం గ్రామానికి చెందిన విజయ్ కుమార్ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. కుమారుడి మృతితో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగారు.


