News February 11, 2025
ములుగు: వైద్యసిబ్బంది అందుబాటులో ఉండాలి: డిప్యూటీ డీఎంహెచ్వో

ఈనెల 12 నుంచి జరగనున్న జాతరలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలని ఐటిడిఏ డిప్యూటీ డీఎంహెచ్వో క్రాంతి కుమార్ అన్నారు. ఈరోజు కొండాయి, ఐలాపురం గ్రామాల్లో నిర్వహించబోయే వైద్యశిబిరాలను ఆయన పరిశీలించారు. ఐలాపురంలో ఇటీవలే నిర్మించిన కంటైనర్ ఆసుపత్రిని సందర్శించారు. Dyడిఎంహెచ్వో మాట్లాడుతూ.. జాతర సమయంలో రోగులకు చికిత్స అందించేందుకు మందులు నిల్వ చేసుకోవాలన్నారు.
Similar News
News March 5, 2026
ప.గో: రూ. 3 కోట్ల విలువైన బంగారంతో వ్యాపారి పరారీ

ఆభరణాలు తయారు చేస్తానని నమ్మించి పశ్చిమ బెంగాల్‌కు చెందిన సిసిర్ బేగ్ తణుకులో పలువురు మహిళల నుంచి సేకరించిన సుమారు రూ. 3 కోట్ల విలువైన బంగారంతో ఉడాయించాడు. జనవరి 9 నుంచి అతడు కనిపించకుండా పోవడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. అయితే పోలీసులు కేసు నమోదులో తాత్సారం చేశారని, ఇప్పుడు నిందితుడు ఐపీ నోటీసులు పంపాడని బాధితులు ఆరోపిస్తున్నారు. తమకు న్యాయం చేయాలని బాధితులు వేడుకుంటున్నారు.
News March 5, 2026
విశాఖ: ‘అద్దె భవనాల్లో అంగన్వాడీ కేంద్రాలు’

ఉమ్మడి విశాఖ జిల్లాలో 2,684 అంగన్వాడీ కేంద్రాలు ఉండగా వీటిలో 1,584 కేంద్రాలు అద్దె భవనంలో నడుస్తున్నాయని పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్ బాబు తెలిపారు. గురువారం అసెంబ్లీలో ఆయన మాట్లాడారు. భవనాల నిర్మాణాలతో పాటు కేంద్రాల్లో కనీస సదుపాయాల కల్పనకు పెద్ద ఎత్తున నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు కల్పించినప్పుడే పిల్లల సంఖ్య కూడా పెరుగుతుందని అన్నారు.
News March 5, 2026
నెల్లూరు: ఈ నంబర్లు మీ దగ్గర ఉన్నాయా..?

వేసవికాలం దృష్ట్యా ప్రజలు ఫైర్ స్టేషన్‌కు సంబంధించిన ఫోన్ నంబర్లు అందుబాటులో ఉంచుకోవాలి. టోల్ ఫ్రీ నంబర్ 101, నెల్లూరు – 0861 2331051, 9963734284, కావలి – 08626 243101, 9963734286, ఆత్మకూరు – 08627 221222, 9963734394, పొదలకూరు -08621 225202, 9963734828, రాపూరు – 08621 226145, 9963735094, ఉదయగిరి- 08620 229251, 9963735314, వింజమూరు – 08629 214437, 9963735446, మర్రిపాడు- 08620 228800, 9963744817.


