News February 11, 2025
HYD: వేధింపులు.. ఈ నంబర్లు మీ కోసమే!

రాజధానిలోని మూడు కమిషనరేట్‌ల పరిధిలో మహిళలు ఎలాంటి లైంగిక వేధింపులకు గురైనా.. తమకు ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచిస్తున్నారు. HYD-9490616555 , 8712662111, సైబరాబాద్-9490617444, తెలంగాణ మహిళా భద్రత విభాగం వాట్సాప్ 8712656856 ద్వారా సమాచారం తెలియచేస్తే కొద్ది క్షణాల్లోనే చర్యలు చేపడతామని తాజాగా పోలీసులు మహిళలకు భరోసా ఇస్తున్నారు.
Similar News
News September 17, 2025
నిజాం ఒక్కడు కాదు.. ఒక వంశం

అసఫ్ జా వంశానికి చెందిన రాజులే ఈ నిజాంలు. 1724లో హైదరాబాద్‌లో వీరి పాలన మొదలై, 1948 వరకు (225 ఏళ్లు) పాలించారు. నిజాం చెప్పిందే రాజ్యాం.. చేసింది చట్టం. వీరిలో నిజాం ఉల్ ముల్క్(1724-1748) మొదటివాడు. నిజాం అలీఖాన్(1762-1802), నాసిర్ ఉద్దౌలా ఫర్జుందా అలీ(1829-1857), అఫ్జల్ ఉద్దౌలా మీర్ టెహ్షియత్ అలీ ఖాన్(1857-1869), ఫతే జంగ్ మహబూబ్ అలీ ఖాన్(1869-1911), ఇక చివరి వాడే మీర్ ఉస్మాన్ అలీ ఖాన్(1911-1949).
News September 17, 2025
HYD: పసిప్రాయంలోనే.. పోరాటంలో

1948 SEP 17..గౌలీపురా గల్లీ జనంతో నిండింది. అందరి దృష్టి స్వాతంత్ర్య సమరయోధుడు రాజ్ బహదూర్ గౌర్ చెల్లెలు అవ్‌ధీశ్ రాణి ఇంటి గుమ్మానికి వేలాడుతున్న రేడియోపైనే ఉంది. ‘HYD సంస్థానం భారత్‌లో విలీనమైంది’ అని ప్రకటించగానే ఎగిరి గంతేశారు. దీపావళికి ఇంటికొచ్చిన మగ్దూం, జావేద్ రిజ్వీలను పోలీసుల నుంచి కాపాడింది. ‘పాల్‌రాబ్సన్’ కోడ్‌తో సమరయోధులకు భోజనం, సమాచారం చేరవేసి పోరాటంలో 8ఏళ్లకే భాగమైంది.
News September 17, 2025
జూబ్లీహిల్స్ టికెట్ నాకే ఇవ్వాలి: అంజన్ కుమార్

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక వేళ కాంగ్రెస్ నుంచి మాజీ ఎంపీ పేరు అనుహ్యంగా తెరమీదకు వచ్చింది. ఇటీవల ‘రావాలి అంజన్న.. కావాలి అంజన్న’ అంటూ వెలసిన ఫ్లెక్సీలకు అంజన్ కుమార్ యాదవ్ బలం చేకూర్చారు. ‘యాదవ సామాజిక వర్గానికి సిటీలో ప్రాతినిధ్యం లేదు. జూబ్లీహిల్స్ టికెట్ నాకే ఇవ్వాలి’ అంటూ కుండబద్దలు కొట్టారు. మంత్రి పదవి కోరుకోవడంలో తప్పేముందని, హైకమాండ్ తనకే టికెట్ ఇస్తుందని ఆశాభావం వ్యక్తంచేశారు.