News February 11, 2025
ఎన్నికల నిర్వహణకు సన్నద్ధం కావాలి: KMR కలెక్టర్

స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధం కావాలని KMR జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అధికారులకు ఆదేశించారు. ఎన్నికలకు సంబంధించిన అంశాలపై కలెక్టరేట్‌లో ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు సోమవారం శిక్షణ తరగతులు నిర్వహించారు. ఎన్నికల నిర్వహణ కోసం ముందస్తుగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలని సూచించారు. ఎలాంటి తప్పిదాలకు తావులేకుండా విధులను జాగ్రత్తగా నిర్వర్తించాలని హితవు పలికారు.
Similar News
News September 19, 2025
తెరపైకి బూచేపల్లి.. అసలేం జరుగుతోంది?

మద్యం కుంభకోణం కేసు గురించి ప్రకాశం జిల్లాలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఒంగోలు వైసీపీ MP అభ్యర్థిగా పోటీచేసిన చెవిరెడ్డిని ఈ కేసులో అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. దర్శి MLA బూచేపల్లి పేరు ఈ కేసులో వినిపిస్తోంది. మద్యం కుంభకోణంలో ఆయన ప్రమేయం ఉదంటూ సిట్ ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. డబ్బులు బూచేపల్లికి చేరాయని ఆరోపిస్తుండగా.. నిజంగా ఆయన పాత్ర ఉందా? లేక కావాలనే చేర్చారా? అనేది తేలాల్సి ఉంది.
News September 19, 2025
NLG: బిల్లులు ఇప్పించండి మహాప్రభో..!

నల్గొండ జిల్లాలో బెస్ట్ అవైలబుల్ స్కూళ్లకు ప్రభుత్వం సకాలంలో బకాయిలు చెల్లించడం లేదు. దీంతో ఏటేటా ఈ బకాయిలు పెరిగి ఇప్పటివరకు సుమారుగా రూ.6.81 కోట్ల పైగా బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి. దీంతో ప్రైవేట్ పాఠశాల యాజమాన్యాలు మూడేళ్లుగా బిల్లులు అందక ఆందోళన చెందుతున్నారు. 2022-23 నుంచి ప్రభుత్వం బిల్లులు చెల్లించడం లేదని ఆయా పాఠశాలల యాజమాన్యాలు తెలిపాయి.
News September 19, 2025
HYD: ‘అయ్యా..! మా కడుపుమీద కొట్టకండి

HYD, రంగారెడ్డి జిల్లాలోని పేదల రేషన్‌కార్డులు కట్ చేశారని మండిపడుతున్నారు. సమాచారం ఇవ్వకుండా తమ కడుపుమీద కొట్టారని వాపోతున్నారు. డీలర్ల వద్ద సమాచారం లేదని, అధికారులను అడగాలంటున్నారని వాపోయారు. వ్యవస్థ మీద అవగాహనలేనివారి పరిస్థితి ఏంటని ప్రశిస్తున్నారు. కొందరు మండలాఫీసులో సంప్రదిస్తే అధికారులకే కారణం తెలియడంలేదని వాపోతున్నారు. తమ కార్డలు పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్నారు. మీ కార్డూ రద్దైందా?