News February 11, 2025
శ్రీ సత్యసాయి: ప్రజా పిర్యాదుల పరిష్కారానికి 58 పిటిషన్లు

శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ కార్యాలయంలో జరిగిన ప్రజా పిర్యాదుల వేదికకు 58 పిటిషన్లు వచ్చినట్టు ఎస్పీ రత్న పేర్కొన్నారు. సోమవారం ఎస్పీ రత్న జిల్లాలోని వివిధ ప్రాంతాలనుంచి వచ్చిన వారి నుంచి వినతులు స్వీకరించారు. పిర్యాదులపై త్వరితగతిన స్పందించి పరిష్కరించాలని జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన పోలీస్ అధికారులను ఆదేశించారు.
Similar News
News March 13, 2026
అనకాపల్లి జిల్లాలో పర్యాటక ప్రాంతాల అభివృద్ధిపై నివేదిక

అనకాపల్లి జిల్లాలో పర్యాటక ప్రాంతాలైన బొజ్జన్న కొండ, కొండకర్ల ఆవ, సముద్రతీర ప్రాంతాల్లో పర్యాటక ప్రదేశాల అభివృద్ధికి చేపడుతున్న కార్యక్రమాలను సీఎం చంద్రబాబుకు కలెక్టర్ విజయ కృష్ణన్ నివేదికను అందజేశారు. జిల్లాలో పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక రూపొందించి అమలు చేయాలని కలెక్టర్‌కు సీఎం సూచించారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో కలెక్టర్లకు ర్యాంకింగ్‌లు ఇవ్వనున్నట్లు తెలిపారు.
News March 13, 2026
ఉగాది కానుక.. నేడు అకౌంట్లలోకి రూ.6వేలు

పీఎం కిసాన్ స్కీమ్‌లో భాగంగా ఇవాళ PM మోదీ అస్సాం పర్యటనలో 22వ విడత నిధులు విడుదల చేయనున్నారు. 9.32Cr మంది ఖాతాల్లో ₹2K చొప్పున జమ చేస్తారు. అలాగే APలో ఉగాది కానుకగా PM KISANతోపాటు అన్నదాత సుఖీభవ నిధులను CM CBN కృష్ణా(D) గన్నవరంలో రిలీజ్ చేస్తారు. 46.85L మంది అకౌంట్లలో ₹6K చొప్పున(₹2K+₹4K) జమ చేస్తారు. ఈ జాబితాలో మీ పేరుందో లేదో <
News March 13, 2026
మద్యం విక్రయాల్లో చిత్తూరు జిల్లాకు నాలుగో స్థానం

మద్యం విక్రయాలు, ఎక్సైజ్ పన్నుల వసూళ్లలో చిత్తూరు జిల్లా ముందంజలో ఉంది. రూ.819.08 కోట్ల లక్ష్యానికిగానూ రూ.865.08 కోట్లతో (106శాతం) రాష్ట్రంలో నాలుగో స్థానంలో నిలిచింది. కొత్త పాలసీ రాకముందు జిల్లాలో 18, 682 లీటర్ల అక్రమ మద్యం సీజ్ చేయగా, పాలసీ తర్వాత (అక్టోబరు- ఫిబ్రవరి మధ్య) అది కేవలం 1827 లీటర్లకు తగ్గిపోయింది.


