News March 20, 2024
చిత్తూరు: CR రాజన్‌కు అధ్యక్ష పదవి

TDP చిత్తూరు పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడిగా తిరుచానూరు మాజీ సర్పంచ్ CR రాజన్ నియమితులయ్యారు. ఇప్పటి వరకూ ఆ పదవిలో వున్న పులివర్తి నాని TDP చంద్రగిరి ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఎన్నికల్లో బిజీగా ఉండటంతో ఆయన బాధ్యతలను రాజన్‌కు అప్పగిస్తూ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఉత్తర్వులు విడుదల చేశారు. ఆయన చిత్తూరు సీటు ఆశించగా గురజాల జగన్మోహన్‌కు దక్కింది.
Similar News
News March 3, 2026
చిత్తూరు: ప్రియురాలిపై అనుమానంతో సూసైడ్

ప్రియురాలిపై అనుమానంతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన కార్వేటినగరంలో జరిగింది. పద్మ సరస్సు ఎస్టీ కాలనీకి చెందిన చంద్రశేఖర్ (35) ఓ మహిళతో సాన్నిహిత్యంగా ఉంటున్నాడు. ఆ మహిళపై అనుమానంతో కొందుగాని మిట్ట వద్ద ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News March 3, 2026
చిత్తూరు: నేడు సెలవు

హోలీ సందర్భంగా చిత్తూరు జిల్లాలోని అన్ని యాజమాన్య పాఠశాలలకు మంగళవారం సెలవు ఇస్తున్నట్లు డీఈవో రాజేంద్రప్రసాద్ తెలిపారు. ఎక్కడైనా పాఠశాలలు నిర్వహిస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. అకడమిక్ క్యాలెండర్‌లో సెలవు దినంగా పేర్కొన్న బుధవారం (4వ తేదీ) సాధారణ పనిదినంగా ఉంటుందన్నారు.
News March 3, 2026
చిత్తూరు జిల్లాలో వారికి వారం రోజుల గడువు

గుర్తింపు పొందని ప్రైవేటు ఆసుపత్రులు, వివిధ క్లినిక్లకు చిత్తూరు DMHO సుధారాణి కీలక సూచనలు చేశారు. APMCE చట్టం ప్రకారం అనుమతి పొందేలా వారం రోజుల్లో దరఖాస్తులు చేసుకోవాలనన్నారు. చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇంకా గుర్తింపు పొందని ప్రైవేటు ఆసుపత్రులు, క్లినిక్‌లు, ఫిజియోథెరపీ యూనిట్లు డీఎంహెచ్‌వో వద్ద రిజిస్ట్రేషన్‌కు దరఖాస్తు చేసుకోవాలన్నారు.


