News February 11, 2025

అనకాపల్లి: ‘అసంఘటిత కార్మికులకు ఈ-శ్రమ కార్డులు’

image

అసంఘటిత కార్మికులకు సామాజిక భద్రతకు కేంద్ర ప్రభుత్వం ఈ-శ్రమ పథకాన్ని ప్రవేశపెట్టినట్లు అనకాపల్లి జిల్లా కార్మిక శాఖ అధికారి వసంతరావు తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లో వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మాట్లాడుతూ.. ఈ పథకంలో చేరేందుకు 16 నుంచి 59 ఏళ్ల వయసు కలిగి ఉండాలన్నారు. ఈ పథకంలో చేరిన కార్మికుల్లో ఎవరైనా ప్రమాదవశాత్తు మృతి చెందితే రూ.2 లక్షలు బీమా వర్తిస్తుందన్నారు.

Similar News

News March 9, 2026

పార్వతీపురం: ‘మీకోసం వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవచ్చు’

image

పార్వతీపురం జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో సోమవారం PGRS కార్యక్రమం నిర్వహించాలని కలెక్టర్ ప్రభాకర్‌ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రతి కార్యాలయంలో ప్రజల సమస్యలపై అర్జీలు స్వీకరించాలన్నారు. కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక సెల్‌లో ప్రతిరోజూ వినతులు స్వీకరిస్తామన్నారు. అర్జీదారులు మీకోసం వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని, వివరాలను 1100 నంబర్‌కి ఫోన్ చేసి తెలుసుకోవచ్చు అన్నారు.

News March 9, 2026

అనకాపల్లి: ఇటీవల తండ్రి.. ఇప్పుడు కొడుకు మృతి

image

ఎలమంచిలి (M) ఏటికొప్పాక వరాహనది సమీపంలో రక్తపు మడుగులో <<19331621>>బాలుడు కౌసిక్ <<>>మృతి చెందిన విషయం తెలిసిందే. సీఐ ధనుంజయ నాయుడు ఆధ్వర్యంలో పోలీసులు పరిశీలించి బాలుడి శరీరంపై లోతైన గాయం ఉన్నట్లు గుర్తించారు. దీంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. తోటి బాలురను విచారించారు. కాకినాడ(D) తునికి చెందిన కౌశిక్ ఏటికొప్పాకలో మేనమామల వద్ద ఉంటూ చదువుకుంటున్నాడు. కౌశిక్ తండ్రి ఇటీవల మృతి చెందడం గమనార్హం.

News March 9, 2026

జూరాల సామర్థ్యం పెంచేలా డీసిల్టింగ్ పనులు

image

జూరాల ప్రాజెక్టులో పూడికతీత పనులను యుద్ధప్రాతిపదికన చేపట్టాలని సాగునీటి శాఖ అధికారులను మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జూపల్లి, వాకిటి శ్రీహరి ఆదేశించారు. ప్రాజెక్టు 11.94 టీఎంసీలు కాగా, పూడిక వల్ల అది 9 TMCలకు పడిపోవడంపై సమీక్షించారు. నీటి నిల్వ సామర్థ్యం తిరిగి పెంచి, ఆయకట్టుకు పూర్తిస్థాయిలో సాగునీరు అందించేలా ప్రణాళికలు సిద్ధం చేసి, పనులు చేపట్టాలని అధికారులకు సూచించారు.