News February 11, 2025
సంగారెడ్డి: ప్రతిభ పోటీలను సద్వినియోగం చేసుకోవాలి: DEO

సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని సైన్స్ మ్యూజియంలో నిర్వహించిన జిల్లా స్థాయిలో నిర్వహించిన భౌతిక రసాయన శాస్త్రం ప్రతిభ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. అనంతరం డిఈవో మాట్లాడుతూ.. విద్యార్థులు ప్రతిభ పోటీలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Similar News
News September 16, 2025
సిరిసిల్ల: ‘హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు’

హత్యకేసులో నిందితుడికి జీవిత ఖైదుతో పాటు రూ.1,000 జరిమానా విధిస్తూ జిల్లా ప్రధాన న్యాయమూర్తి నీరజ మంగళవారం తీర్పు వెలువరించినట్టు సిరిసిల్ల SP మహేష్ బి గితే తెలిపారు. SP తెలిపిన వివరాలు.. వేములవాడలోని ఓ మామిడి తోటలో మరిపెళ్లి రాజయ్య(64), మంత్రి ఆనందం పనిచేస్తూ ఉండేవారు. ఇద్దరి మధ్యలో గొడవలు రాగా ఆనందం ఏప్రిల్ 29, 2024లో రాజయ్యను పారతో తలపై బాది హత్య చేశాడు. నేరం రుజువు కాగా శిక్ష పడిందన్నారు.
News September 16, 2025
సిరిసిల్ల: ‘SIR కట్టుదిట్టంగా నిర్వహించాలి’

ఓటర్ జాబితా స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్ కట్టుదిట్టంగా నిర్వహించాలని సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. సిరిసిల్ల కలెక్టరేట్లో SIR పై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. 2002 సం. తర్వాత కొత్తగా ఓటర్ నమోదు చేసుకున్న ప్రతి ఓటర్ వివరాలు క్షేత్రస్థాయిలో వెరిఫై చేయాలన్నారు. 40ఇయర్స్ కంటే ఎక్కువ వయసున్న ఓటర్ల జాబితా వెరిఫై చేయాల్సిన అవసరం ఉండదన్నారు.
News September 16, 2025
మెదక్: ‘పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలి’

పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డికి 2003 ఉద్యోగ, ఉపాధ్యాయ పాత పెన్షన్ నాయకులు వినతిపత్రం అందజేశారు. కేంద్ర ప్రభుత్వ మెమో 57 ఆధారంగా, ఇటీవల రాష్ట్ర హై కోర్టు 2003 ఉద్యోగ, ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానాన్ని వర్తింపజేస్తు 3 నెలలో అమలు చేయాలని స్పష్టంగా తీర్పు ఇచ్చిందని గుర్తు చేశారు. మాడవేడి వినోద్ కుమార్, ఇమ్మడి సంతోశ్ కుమార్ తదితరులున్నారు.