News February 11, 2025
శ్రీశైలం: మంత్రుల సమావేశంలో మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి

శ్రీశైలం దేవస్థానం కమాండ్ కంట్రోల్ రూంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలపై ఏర్పాటు చేసిన మంత్రుల సమీక్షా సమావేశంలో మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి పాల్గొన్నారు. సీఎం చంద్రబాబు ఈ ఉత్సవాల్లో పాల్గొనే అవకాశం ఉండటంతో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్, ఎస్పీకి సూచించారు. శివరాత్రి బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తుల సౌకర్యార్థం అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేయాలని ఈవో, సిబ్బందిని మంత్రి బీసీ ఆదేశించారు.
Similar News
News September 19, 2025
NLG: బిల్లులు ఇప్పించండి మహాప్రభో..!

నల్గొండ జిల్లాలో బెస్ట్ అవైలబుల్ స్కూళ్లకు ప్రభుత్వం సకాలంలో బకాయిలు చెల్లించడం లేదు. దీంతో ఏటేటా ఈ బకాయిలు పెరిగి ఇప్పటివరకు సుమారుగా రూ.6.81 కోట్ల పైగా బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి. దీంతో ప్రైవేట్ పాఠశాల యాజమాన్యాలు మూడేళ్లుగా బిల్లులు అందక ఆందోళన చెందుతున్నారు. 2022-23 నుంచి ప్రభుత్వం బిల్లులు చెల్లించడం లేదని ఆయా పాఠశాలల యాజమాన్యాలు తెలిపాయి.
News September 19, 2025
HYD: ‘అయ్యా..! మా కడుపుమీద కొట్టకండి

HYD, రంగారెడ్డి జిల్లాలోని పేదల రేషన్‌కార్డులు కట్ చేశారని మండిపడుతున్నారు. సమాచారం ఇవ్వకుండా తమ కడుపుమీద కొట్టారని వాపోతున్నారు. డీలర్ల వద్ద సమాచారం లేదని, అధికారులను అడగాలంటున్నారని వాపోయారు. వ్యవస్థ మీద అవగాహనలేనివారి పరిస్థితి ఏంటని ప్రశిస్తున్నారు. కొందరు మండలాఫీసులో సంప్రదిస్తే అధికారులకే కారణం తెలియడంలేదని వాపోతున్నారు. తమ కార్డలు పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్నారు. మీ కార్డూ రద్దైందా?
News September 19, 2025
దసరా స్పెషల్ బస్సుల్లో ఛార్జీలు పెంపు!

TG: దసరా <<17751389>>స్పెషల్ బస్సుల్లో<<>> సవరించిన ఛార్జీలు అమల్లో ఉంటాయని RTC ప్రకటించింది. దీంతో టికెట్ ధర 50% పెరిగే అవకాశం ఉంది. ఈ నెల 20, 27-30, అక్టోబర్ 1, 5, 6 తేదీల్లో నడిచే స్పెషల్ బస్సుల్లో ఈ సవరణ ఛార్జీలు అమల్లో ఉంటాయి. రెగ్యులర్ సర్వీసుల ఛార్జీల్లో మార్పు ఉండదని సంస్థ తెలిపింది. 2003లో ప్రభుత్వం జారీ చేసిన GO 16 ప్రకారం స్పెషల్ బస్సులకు ఛార్జీలు సవరిస్తున్నట్లు RTC గతంలో పలుమార్లు వివరణ ఇచ్చింది.