News February 11, 2025

ఇకపై ఆ రైలు ప్రయాణం మరింత సౌకర్యవంతం

image

విజయవాడ- సికింద్రాబాద్ మధ్య ప్రయాణించే శాతవాహన ఎక్స్‌ప్రెస్‌లను(నం.12713& 12714) మోడరన్ లింక్డ్ హాఫ్‌మన్ బుష్(LHB) కోచ్‌లతో నడపనున్నారు. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది. నేడు సోమవారం నుంచి LHB కోచ్‌లతో నడిచే విధంగా ప్రయాణికులకు మరింత సౌకర్యవంతంగా ఈ రైలును అభివృద్ధి చేశామని దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది.

Similar News

News November 5, 2025

GWL: దాసరి బీసన్న పోరాటానికి ఫలితం

image

ఎర్రవల్లి కి చెందిన దాసరి బీసన్న గ్రామాల్లో తిరుగుతూ చిన్నపాటి వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగించాడు. వ్యాపారాన్ని అభివృద్ధి చేసేందుకు గద్వాల మహేంద్ర షో రూమ్‌లో ఓ వాహనాన్ని కొనుగోలు చేశాడు. ఆ వాహనం కొద్ది రోజులకే మొరాయించింది. వాహనాన్ని మార్చాలని షోరూమ్ ఎదుట కుటుంబ సభ్యులతో ఆందోళన చేశాడు. వారికి ప్రజాసంఘాలు మద్దతు పలికాయి. ఎట్టకేలకు మంగళవారం షోరూం నిర్వాహకులు అతడికి కొత్త వాహనాన్ని అందజేశారు.

News November 5, 2025

జగన్‌లో నానాటికి పైశాచికత్వం పెరుగుతుంది: ప్రత్తిపాటి

image

జగన్ రైతుల నమ్మకానికి అనర్హుడని మాజీ మంత్రి, ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు మండిపడ్డారు. చిలకలూరిపేటలో మంగళవారం ఆయన కార్యాలయంలో మాట్లాడారు. రైతులు, వ్యవసాయం గురించి జగన్ మాట్లాడుతుంటే నాగలి నవ్వుతుందని, నేలతల్లి బోరు మంటుందన్నారు. చంద్రబాబు నాయకత్వం పటిమతో ఏపీకి వస్తున్న పెట్టుబడులు, పరిశ్రమలతో జగన్‌లో నానాటికి పైశాచికత్వం పెరుగుతుందన్నారు.

News November 5, 2025

కార్తీక పౌర్ణమికి నదీ స్నానాలకు వెళ్లే వారు జాగ్రత్త: ఎస్పీ

image

కార్తీక పౌర్ణమికి నది స్నానాలకు వెళ్లే జిల్లాలోని భక్తులు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ ధీరజ్ కునుబిల్లి మంగళవారం కోరారు. నదీ స్నానాలు, దేవాలయాల సందర్శ నల విషయంలో భక్తులు తప్పక పాటించాల్సిన కీలక సూచనలను ఎస్పీ విడుదల చేశారు. భారీ వర్షాల కారణంగా నదుల్లో ప్రవాహం ఉద్ధృతంగా ఉందని, లోతు లేని సురక్షిత ప్రాంతంలోనే స్నానం చేయాలన్నారు. సుడులు తిరిగే ప్రాంతాలకు వెళ్లకుండా దీపాలు నీటిలో వదలాలని సూచించారు.