News February 11, 2025
FEB 12 నుంచి సమ్మక్క-సారలమ్మ జాతర

ముధోల్ మండలంలోని ఎడ్బిడ్ తాండలో ఏటా నిర్వహించే సమ్మక్క సారలమ్మ జాతరకు గద్దెలు ముస్తాబైనట్లు దేవదాయ స్థాపకులు రేణుకమ్మ సోమవారం తెలిపారు. ఈ జాతరకు ముధోల్ నియోజకవర్గంతో పాటు నిజామాబాద్, హైదరాబాద్ నుంచే కాకుండా మహారాష్ట్రలోని ముంబై, ధర్మాబాద్ ప్రాంతాల నుంచి భారీగా సంఖ్యలో భక్తులు సమ్మక్క- సారలమ్మలను దర్శించుకుంటారు. ఈనెల 12 నుంచి 15వ తేదీ వరకు సమ్మక్క -సారలమ్మ జాతర జరుగుతుందన్నారు.
Similar News
News March 19, 2026
MBNR: రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్

రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డుదారులకు ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది. గతేడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించిన ఉచిత బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేయాలని పౌరసరఫరాల శాఖ నిర్ణయించింది. ఏప్రిల్ 1 నుంచే ఈ పంపిణీ ప్రక్రియ ప్రారంభం కానుంది. మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 68,288 అంత్యోదయ కార్డులు, 10,24,472 ఆహార భద్రత కార్డులు ఉన్న లబ్ధిదారులకు ప్రయోజనం చేకూరనుంది.
News March 19, 2026
అమెరికాలోకి డ్రోన్లు.. హై అలర్ట్‌లో వాషింగ్టన్!

ఇరాన్‌తో ఉద్రిక్తతల వేళ వాషింగ్టన్‌లోని ఫోర్ట్ మెక్‌నాయర్ మిలిటరీ బేస్‌పై గుర్తుతెలియని డ్రోన్లు తిరగడం కలకలం సృష్టించింది. ఈ ప్రాంతంలోనే US విదేశాంగ మంత్రి రూబియో, రక్షణ మంత్రి హెగ్‌సెత్ నివాసాలు ఉండటంతో భద్రతా దళాలు అలర్ట్ అయ్యాయి. గత 10 రోజులుగా ఇక్కడ డ్రోన్ల కదలికలు కనిపిస్తుండటంతో ఉన్నతాధికారులు ఎమర్జెన్సీ మీటింగ్స్ నిర్వహించారు. ఇరాన్ ప్రతీకార దాడులకు దిగే అవకాశం ఉందని అనుమానిస్తున్నారు.
News March 19, 2026
పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ రివ్యూ&రేటింగ్

అవినీతి నాయకులు, వారికి సాయపడే టెర్రరిస్టులను హీరో ఎలా ఎదుర్కొన్నారనేదే ‘ఉస్తాద్ భగత్ సింగ్’ స్టోరీ. మేనరిజమ్స్, డాన్సులు, నటనతో పవన్ వన్‌మ్యాన్ షో చేశారు. చిరు-పవన్ పాత సాంగ్స్ ఆకట్టుకుంటాయి. శ్రీలీల నటన బాగుంది. ఫ్యాన్స్ కోసం మాస్ ఎలివేషన్స్, డైలాగులతో డైరెక్టర్ హరీశ్ శంకర్ కథను నడిపించారు. ఔట్‌డేటెడ్ స్టోరీ, కొన్ని లాజిక్ లేని సీన్లు, BGM మైనస్. కామెడీ పెద్దగా వర్కౌట్ కాలేదు.
రేటింగ్: 2.5/5


